News March 5, 2025

BRS పొరపాటు వల్లే రైతులకు ఇబ్బందులు: మంత్రి ఉత్తమ్

image

కృష్ణా, గోదావరి జలాల్లో BRS చేసిన పొరపాటు వల్ల రైతులకు ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి ఉత్తమ్ అన్నారు. హరీశ్ రావు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ‘ఖరీఫ్‌లో ఉమ్మడి AP కంటే ఎక్కువ వరి TGలో పండింది. రబీలో 56L ఎకరాల పైగానే సాగు జరుగుతోంది. తక్కువ నీటిని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాం. APకి BRS ధారాదత్తంగా నీటిని వదిలిపెట్టింది. మేం అధికారంలోకి వచ్చాక రూల్స్ మార్చాలని ఒత్తిడి తెచ్చాం’ అని తెలిపారు.

Similar News

News December 17, 2025

SRH మేనేజ్‌మెంట్‌పై ఫ్యాన్స్ ఫైర్

image

IPL-2026 సీజన్‌కు SRH టీమ్‌లో స్టార్ బౌలర్లు లేరని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. హర్షల్ పటేల్, పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్ ఉన్నా వాళ్లు భారీగా రన్స్ సమర్పించుకునే వారేనని గుర్తుచేస్తున్నారు. ఇషాన్ మలింగా, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలె, అమిత్ కుమార్‌, శివమ్ మావిలకు అనుభవం లేదని గుర్తుచేస్తున్నారు. స్టార్ బౌలర్లు లేకుండా టీమ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తారని మండిపడుతున్నారు.

News December 17, 2025

ఎంపీలందరూ సభలో ఉండాలని కాంగ్రెస్ విప్.. జర్మనీలో రాహుల్!

image

MGNREGA పేరు మార్చే బిల్లు ఒకటీరెండు రోజుల్లో పార్లమెంటు ముందుకు రానుంది. ఈ క్రమంలో రానున్న 3 రోజులు హాజరుకావాలని పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. కానీ ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మాత్రం ప్రస్తుతం జర్మనీలో ఉండటం గమనార్హం. దీంతో రాహుల్ విషయంలో LoP అంటే లీడర్ ఆఫ్ పర్యటన్ అని బీజేపీ సెటైర్లు వేసింది. ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అని, శాశ్వతంగా వెకేషన్ మోడ్‌లో ఉంటారని విమర్శించింది.

News December 16, 2025

Photos: వనతారలో మెస్సీ పూజలు

image

‘గోట్ టూర్’లో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇవాళ గుజరాత్‌కు వెళ్లారు. అంబానీ ఫ్యామిలీకి చెందిన వనతారను సందర్శించారు. తన తోటి ప్లేయర్లు సురెజ్, రోడ్రిగోతో కలిసి అక్కడి ఆలయంలో పూజలు చేశారు. నుదుటిన బొట్టుతో, హారతి ఇస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారితోపాటు అనంత్ అంబానీ, రాధిక దంపతులు ఉన్నారు.