News March 22, 2024
IPL: CSKకు 250వ మ్యాచ్

IPL-2024 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. చెన్నైతో తొలి మ్యాచులో RCB టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నైకి ఇది 250వ IPL మ్యాచ్. ఎమ్మెస్ ధోనీ చెన్నై తొలి మ్యాచుతో పాటు 50, 100, 150, 200 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించారు. కానీ ఈసారి అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 250వ మ్యాచులో రుతురాజ్ గైక్వాడ్ జట్టును నడిపిస్తున్నారు.
Similar News
News November 8, 2025
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మేనేజర్ పోస్టులు

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 17 కాంట్రాక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్‌తో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్లకు నెలకు రూ.70వేలు, జూనియర్ మేనేజర్‌లకు రూ.30వేల జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in/
News November 8, 2025
ALERT: పశువులకు ఈ టీకా వేయించారా?

తెలుగు రాష్ట్రాల్లో పశువుల్లో ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నారు. ఈ నెల 14 వరకు అన్ని జిల్లాల్లో పశువులకు వీటిని అందించనున్నారు. 4నెలల వయసు పైబడిన పశువులు అన్నింటికీ ఈ వ్యాక్సిన్స్ వేస్తారు. పశుపోషకుల ఇళ్ల వద్దకే సిబ్బంది వచ్చి ఉచితంగా టీకాలు అందిస్తున్నారు. ఈ టీకాను పశువులకు వేయించడంలో పాడి రైతులు నిర్లక్ష్యం చేయొద్దు.✍️ రోజూ సాగు, పాడి సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 8, 2025
పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలు

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.


