News March 6, 2025
జులై 3 నుంచి అమర్నాథ్ యాత్ర

కశ్మీర్లోని మహాశివుడి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచులింగం ఉండే అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యాత్ర తేదీలు విడుదలయ్యాయి. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్, గాందర్బల్ జిల్లాలోని బాల్టాల్ మార్గాల నుంచి ఒకేసారి యాత్ర ప్రారంభమై 38 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 9తో ముగుస్తుంది. త్వరలోనే యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు.
Similar News
News March 6, 2025
సుప్రీం కోర్టుకు చేరిన TN హిందీ పంచాయితీ

TN, కేరళ, బెంగాల్లో జాతీయ విద్యా విధానం (NEP) అమలుకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. రాజ్యాంగం ప్రకారం అవి NEP అమలు చేయాలని, ఇందుకు MOU కుదుర్చుకున్నాయని పిటిషన్ వేసిన అడ్వకేట్ మణి అన్నారు. దీనిపై TN CM స్టాలిన్ వ్యతిరేకత అవాస్తవం, రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. పాలసీ అమలుపై రాష్ట్రాలను ఆదేశించే హక్కు సుప్రీంకోర్టుకు లేనప్పటికీ రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు కలగజేసుకోవచ్చన్నారు.
News March 6, 2025
IPL ఫ్యాన్స్కు అలర్ట్.. రేపటి నుంచే టికెట్ బుకింగ్స్

‘IPL-2025’ టోర్నీ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈక్రమంలో హైదరాబాద్లో జరిగే తొలి రెండు మ్యాచులకు సంబంధించిన టికెట్లను రేపటి నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నట్లు SRH ప్రకటించింది. 23న SRHvsRR, 27న SRHvsLSG మ్యాచ్లు జరగనున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. రెండు టికెట్లకు ఒక జెర్సీ ఫ్రీగా ఇస్తారు.
News March 6, 2025
‘సూపర్ 6’కు కేటాయింపులు ఏవి?: అంబటి

AP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలకూ నిధులు లేవా? అని ఎద్దేవా చేశారు. జగన్ లేవనెత్తిన ప్రశ్నలపై ప్రభుత్వం ఇప్పటికీ సమాధానం చెప్పలేదని విమర్శించారు. అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పిన నేతలు కేటాయింపులు ఎందుకు చేయలేదని నిలదీశారు. CMగా ఉన్న వ్యక్తి పక్కపార్టీ వారికి సాయం చేయొద్దని చెబుతారా? అని ప్రశ్నించారు.