News March 6, 2025
జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర

కశ్మీర్‌లోని మహాశివుడి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచులింగం ఉండే అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యాత్ర తేదీలు విడుదలయ్యాయి. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామ్, గాందర్‌బల్ జిల్లాలోని బాల్టాల్ మార్గాల నుంచి ఒకేసారి యాత్ర ప్రారంభమై 38 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 9తో ముగుస్తుంది. త్వరలోనే యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు.
Similar News
News January 18, 2026
ఇరాన్ నిరసనల్లో 16,500 మంది మృతి?

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో భారీగా మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది. ‘ఇప్పటిదాకా 16,500-18000 మంది ఆందోళనకారులు చనిపోయారని డాక్టర్లు చెబుతున్నారు. 3.6 లక్షల మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వారే’ అని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అధికారులు మిలిటరీ ఆయుధాలు వాడుతున్నారని, నిరసనకారుల తల, మెడ, ఛాతీ భాగాల్లో బుల్లెట్ గాయాలు ఉన్నాయని ఓ ప్రొఫెసర్ చెప్పినట్లు తెలిపింది.
News January 18, 2026
APPLY NOW: SAILలో ఉద్యోగాలు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<
News January 18, 2026
అరటి పండ్ల విషయంలో గొడవ.. హిందూ వ్యాపారిని కొట్టిచంపారు!

బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్యకు గురయ్యాడు. ‘ఘాజీపూర్‌లో లిటన్ చంద్ర ఘోష్ (55) హోటల్ నిర్వహిస్తున్నాడు. మాసుమ్ మియాకు అరటి తోట ఉంది. ఈ క్రమంలో తమ అరటి పండ్లను ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. లిటన్ హోటల్ వద్ద అవి కనిపించడంతో మాసుమ్, అతడి తల్లిదండ్రులు స్వాపన్, మాజేదా వాగ్వాదానికి దిగారు. విచక్షణారహితంగా కొట్టడంతో లిటన్ చనిపోయాడు. ముగ్గురినీ అరెస్టు చేశాం’ అని పోలీసులు తెలిపారు.


