News March 6, 2025
నిర్మల్: KU పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని రెగ్యులర్ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను విడుదల చేసినట్లు KU అధికారులు పేర్కొన్నారు. 2, 4, 6 డిగ్రీ సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్ష ఫీజు ఈనెల 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. పరీక్షలు ఏప్రిల్ నెలలో ఉంటాయని పేర్కొన్నారు.
Similar News
News March 6, 2025
నిర్మల్: 2nd ఇయర్ పరీక్షకు 296 గైర్హాజరు

గురువారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 2nd ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఇంటర్మిడియట్ విద్యాశాఖ అధికారి జాదవ్ పరశురాం తెలిపారు. 6,102 మంది విద్యార్థులకు గాను 5,806 మంది విద్యార్థులు హజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 5,172, ఒకేషనల్ విభాగంలో 634 మంది విద్యార్థులు పరీక్షకు హజరుకాగా, 296 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.
News March 6, 2025
దేశానికి న్యాయం జరిగేలా చరిత్రను రాయలేదు: నిర్మల

చరిత్రను జరిగింది జరిగినట్లుగా చెప్పాల్సిన సంస్కృతి మనదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘గతంలో చరిత్ర రాసిన వాళ్లు దేశానికి న్యాయం జరిగేలా రాయలేదు. దేశంపై ఆధిపత్యం చెలాయించిన వాళ్లు తమకు అనుకూలంగా చరిత్రను రాసుకునే ప్రయత్నం చేశారు. చరిత్రను వక్రీకరించడం పాశ్చాత్య దేశాల్లోనూ ఉంది’ అని పేర్కొన్నారు.
News March 6, 2025
రాహుల్ గాంధీ దగ్గరికే రానివ్వడం లేదు: మణిశంకర్

రాహుల్ గాంధీకి 20ఏళ్లు మెంటార్‌గా ఉండేందుకు సిద్ధమేనని కాంగ్రెస్ వెటరన్ మణిశంకర్ అయ్యర్ అంటున్నారు. కాకపోతే అతడిది కోరుకోవడం లేదన్నారు. ‘RG నన్ను ఇష్టపడటం లేదు. అతడిపై అభిప్రాయాలు రుద్దేందుకు నేనెవరిని? అతడు కోరుకోనప్పుడు కలిసేదెలా? ప్రియాంకా రానివ్వడం లేదు. సోనియా ఆరోగ్యం బాలేదు. మరి నేనెందుకు వారిని డిస్టర్బ్ చేయాలి? నేనెళ్లి ఎంపీ పోస్టు అడగాలా? జీవితాంతం గాంధీల ప్రాపకంలో ఉన్నాన’ని వివరించారు.