News March 22, 2024

నరసరావుపేట బరిలో ఎముకల వైద్య నిపుణులు

image

AP: పల్నాడు(D) నరసరావుపేటలో మరోసారి ఆసక్తికర పోరు జరగనుంది. TDP నుంచి చదలవాడ అరవింద బాబు, YCP తరఫున గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోటీకి సై అంటున్నారు. వృత్తి రీత్యా వీరిద్దరూ ఎముకలు, కీళ్లకు సంబంధించిన సీనియర్ వైద్యులు కావడం గమనార్హం. నియోజకవర్గ పరిధిలో సొంత హాస్పిటల్స్ ద్వారా వైద్యం అందిస్తున్నారు. 2019 ఎన్నికల్లో గోపిరెడ్డికి లక్ష ఓట్లు రాగా, చదలవాడకు 68 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి.

Similar News

News November 1, 2025

తొక్కిసలాట ఘటనపై అధికారుల వివరణ

image

AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై అధికారులు వివరణ ఇచ్చారు. ఇవాళ ఆలయానికి 15వేల మంది వచ్చారని వెల్లడించారు. ఘటనాస్థలిలో ఏడుగురు, పలాస ఆస్పత్రిలో ఇద్దరు మృతిచెందినట్లు చెప్పారు. ఘటనలో 13 మందికి గాయాలయ్యాయని, వారికి పలాస ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

News November 1, 2025

ప్రకృతి సేద్యంలో వరి సాగు – ఆకునల్లి, పచ్చదోమ నివారణ

image

☛ ఆకునల్లి నివారణకు గట్ల మీద బంతి మొక్కలు నాటాలి. పంట మీద ఆవుపేడ, ఆవు మూత్రం, ఇంగువతో చేసిన 5 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
☛ పచ్చదోమ నివారణకు పసుపు, తెల్లని జిగురు అట్టలను ఎకరానికి 20-25 చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి ఒక లైట్‌ ట్రాప్‌ (దీపపు ఎర)ను పెట్టాలి. 100 లీటర్ల నీటికి 5లీటర్ల వావిలాకు కషాయాన్ని కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.

News November 1, 2025

ఎల్లుండి నుంచి మెట్రో రైలు సమయాల్లో మార్పు

image

TG: మెట్రో రైలు సమయాల్లో మార్పు చోటు చేసుకోనుంది. తొలి ట్రైన్ ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ రాత్రి 11 గంటలకు అన్ని టర్మినల్ స్టేషన్ల నుంచి మొదలవుతాయని L&T హైదరాబాద్ మెట్రో పేర్కొంది. ఎల్లుండి నుంచి కొత్త టైమింగ్స్ అందుబాటులోకి వస్తాయని ప్రకటనలో తెలిపింది. అంతకుముందు తొలి ట్రైన్ ఉదయం 6గంటలకు, చివరి ట్రైన్ రాత్రి 11:45గంటలకు మొదలైన సంగతి తెలిసిందే.