News March 6, 2025

తిరుమల అన్నప్రసాదంలో వడలు

image

AP: తిరుమల శ్రీవారి అన్నప్రసాదంతో పాటు మసాలా వడల పంపిణీని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. భక్తులకు ఆయన స్వయంగా వడ్డించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం అధికారులు తొలి రోజున 35వేల వడలను తయారుచేశారు. క్రమంగా ఈ సంఖ్యను లక్ష వరకు పెంచడానికి చర్యలు తీసుకోనున్నారు.

Similar News

News January 12, 2026

విజయ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

image

కరూర్ తొక్కిసలాటపై TVK చీఫ్ విజయ్‌పై CBI ప్రశ్నల వర్షం కురిపించింది. ‘బహిరంగ సభకు ఆలస్యంగా ఎందుకు వచ్చారు? రాజకీయశక్తిని ప్రదర్శించడం కోసమే అలా చేశారా? జనసమూహంలో కారు నుంచి ఎందుకు బయటకు వచ్చారు? సభలో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా మీరెందుకు ప్రసంగం కొనసాగించారు? నీళ్ల బాటిళ్లను ఎందుకు పంపిణీ చేశారు?’ అని ప్రశ్నించింది. ర్యాలీకి ముందు పార్టీ నేతలతో సమావేశాలపైనా ఆరా తీసింది.

News January 12, 2026

ఉద్యోగం భద్రంగా ఉండాలంటే?

image

ఏ సంస్థలైనా తక్కువతో ఎక్కువ లాభం వచ్చే వనరులపైనే ప్రధానంగా దృష్టి పెడతాయి. కాబట్టి ఎలాంటి స్థితిలోనైనా బాధ్యత తీసుకునే తత్వం ఉండాలి. పలానా వ్యక్తి పనిచేస్తే పక్కాగా ఉంటుందనే పేరును తెచ్చుకోవాలి. ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు కాబట్టి దానికోసం శ్రమించాలి. పని గురించి అప్డేట్‌గా ఉండాలి. ఎన్ని బాధ్యతలున్నా మరీ ఎక్కువగా సెలవులు పెట్టకూడదు. ఆఫీసుకు వెళ్లేది పనిచేసేందుకే కాబట్టి దానిపై దృష్టి పెట్టాలి.

News January 12, 2026

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్(<>GSL<<>>) 10 ఎక్స్‌పర్ట్/స్పెషలిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా అర్హతతో పాటు పనిఅనుభవం గల వారు అర్హులు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://goashipyard.in.