News March 6, 2025
తిరుమల అన్నప్రసాదంలో వడలు

AP: తిరుమల శ్రీవారి అన్నప్రసాదంతో పాటు మసాలా వడల పంపిణీని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. భక్తులకు ఆయన స్వయంగా వడ్డించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం అధికారులు తొలి రోజున 35వేల వడలను తయారుచేశారు. క్రమంగా ఈ సంఖ్యను లక్ష వరకు పెంచడానికి చర్యలు తీసుకోనున్నారు.
Similar News
News February 11, 2026
జగ్గారెడ్డిపై ఎన్నికల సంఘం ఆగ్రహం

TG: సంగారెడ్డిలో జగ్గారెడ్డి <<19110877>>వ్యవహారంపై<<>> రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయన కామెంట్స్ ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. ఆయనపై కేసు నమోదు చేసి, రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. కాగా సీఐ కాంగ్రెస్ అభ్యర్థి చొక్కా పట్టుకున్నారంటూ పోలీసులపై జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ ఆపుతానంటూ పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.
News February 11, 2026
గోడపై క్యాలెండర్ మారుతున్నా జాబ్ క్యాలెండర్ రాదు: షర్మిల

AP: గవర్నర్ బడ్జెట్ ప్రసంగమంతా అవాస్తవాలు, కల్పితాలేనని APCC చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ‘కూటమి సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాప్ అయ్యాయి. మెగా డీఎస్సీని దగా చేశారు. గోడపై క్యాలెండర్లు మారుతున్నా జాబ్ క్యాలెండర్ మాత్రం రావడం లేదు. అన్నదాత సుఖీభవ కింద 40 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారు. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అంతా ఫేక్’ అని ధ్వజమెత్తారు.
News February 11, 2026
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 34 పోస్టులకు నోటిఫికేషన్

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(CEL) 34 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, PhD, MBA/PGP/PGDM, LLB, CA/CMA, టెన్త్, డిగ్రీ, పీజీ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 3వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1,000, SC, ST, PwBDలకు ఫీజు లేదు. రాత పరీక్ష, DV, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.celindia.co.in


