News March 22, 2024

కేజ్రీవాల్ పిటిషన్లు ఎందుకు వెనక్కి తీసుకున్నారు?

image

తమ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ CM కేజ్రీవాల్ సుప్రీంలో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇటీవల కవిత సైతం ఇలాగే చేశారు. రౌస్ అవెన్యూ కోర్టుతో పాటు సుప్రీం కోర్టులోనూ విచారణ ఒకే రోజు ఉండటంతో పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు కేజ్రీవాల్ లాయర్ చెప్పారు. కాగా కవిత పిటిషన్‌పై స్పందించిన SC.. లోయర్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. తమ విషయంలోనూ ఇదే జరుగుతుందనే కేజ్రీవాల్ విత్‌డ్రా చేసుకున్నారని తెలుస్తోంది.

Similar News

News October 2, 2024

ఆలయాల్లో సాయిబాబా విగ్రహాల తొలగింపు

image

యూపీ వారణాసిలోని పలు ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం వివాదానికి దారితీసింది. ‘సనాతన్ రక్షక్ దళ్’ చేపట్టిన ప్రచారంలో భాగంగా 10 మందిరాల్లో నిన్న బాబా విగ్రహాలను తొలగించి, ఆలయాల బయట పెట్టారు. సరైన పరిజ్ఞానం లేకుండా సాయిబాబాను ఆరాధిస్తున్నామని, శాస్త్రాల్లో ఎక్కడా బాబా ఆరాధన గురించి చెప్పలేదన్నారు. బాబా ధర్మ గురువే కావొచ్చు కానీ దేవుడు కాదని అయోధ్యలోని హనుమాన్ గఢీ ఆలయ మహంతు అభిప్రాయపడ్డారు.

News October 2, 2024

రేపటి నుంచి టెట్

image

AP: ఈ నెల 3 నుంచి 21 వరకు టెట్-2024 పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉ.9.30 నుంచి మ.12 వరకు, రెండో సెషన్ మ.2.30 నుంచి సా.5 వరకు ఉంటుంది. హాల్ టికెట్లలో తప్పులు ఉంటే సరైన ఆధారాలు చూయించి సెంటర్ దగ్గరున్న నామినల్ రోల్స్‌లో సరిచేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటివరకు హాల్ టికెట్లు తీసుకోని వారు https://aptet.apcfss.in/కు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.

News October 2, 2024

సుప్రీం వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి: అవినాశ్ రెడ్డి

image

AP: రాజకీయాల కోసమే తిరుమల లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చారని ఎంపీ అవినాశ్ రెడ్డి విమర్శించారు. ‘కల్తీ నెయ్యి వాడలేదని EO ప్రకటించారు. వాడారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకే సయోధ్య లేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. YCP నాయకులను కేసులతో వేధిస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి’ అని హెచ్చరించారు.