News March 6, 2025
నారా భువనేశ్వరికి స్వాగతం పలికిన ఎంపీ కేశినేని దంపతులు

విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ టీచర్స్ కాలనీలో గురువారం జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ కేశినేని దంపతులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన నారా భువనేశ్వరికి కేశినేని దంపతులు ఘన స్వాగతం పలికారు.
Similar News
News March 6, 2025
తల్లి కాబోతున్న వినేశ్ ఫొగట్

భారత మాజీ రెజ్లర్, ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ‘మా లవ్ స్టోరీ కొత్త చాప్టర్‌తో కొనసాగనుంది’ అని తన భర్త సోంవీర్ రథీతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 2024లో ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన ఫొగట్ అధిక బరువు కారణంగా గోల్డ్ మెడల్ సాధించలేకపోయారు. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు.
News March 6, 2025
VZM: జిల్లా జడ్జిలతో ప్రధాన న్యాయమూర్తి సమావేశం

పట్టణంలోని స్థానిక జిల్లా కోర్టులో జడ్జిలతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. రాజీకు వచ్చే క్రిమినల్, మోటార్, ప్రమాద బీమా, బ్యాంక్, చెక్ బౌన్స్, తదితర కేసులను ఇరు పార్టీల సమక్షంలో పరిష్కరించలన్నారు.
News March 6, 2025
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు: MNCL కలెక్టర్

జిల్లాలో శాంతిభద్రతలకు అవరోధంగా మారే భూసంబంధిత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మండల, సబ్ డివిజన్, జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేసే కమిటీ ప్రతినిధులు ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి గ్రీవెన్స్ నంబర్ కేటాయిస్తారన్నారు. సందేహాల నివృత్తికి 08736 250106 కాల్ చేయాలని సూచించారు.