News March 6, 2025
తల్లి కాబోతున్న వినేశ్ ఫొగట్

భారత మాజీ రెజ్లర్, ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ‘మా లవ్ స్టోరీ కొత్త చాప్టర్‌తో కొనసాగనుంది’ అని తన భర్త సోంవీర్ రథీతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 2024లో ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన ఫొగట్ అధిక బరువు కారణంగా గోల్డ్ మెడల్ సాధించలేకపోయారు. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు.
Similar News
News March 22, 2025
కెప్టెన్సీకి హీథర్ నైట్ రాజీనామా

ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి హీథర్ నైట్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ECB ధ్రువీకరించింది. 9 ఏళ్లపాటు సేవలందించినందుకు థ్యాంక్స్ అని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 2016లో కెప్టెన్‌గా ఎంపికైన హీథర్ ఏకంగా 199 మ్యాచ్(టెస్టు, వన్డే, టీ20)లకు నాయకత్వం వహించారు. ఆమె సారథ్యంలోనే ఇంగ్లండ్ 2017 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. హీథర్ 3 ఫార్మాట్లలో 7వేలకు పైగా రన్స్, 84 వికెట్లు తీశారు.
News March 22, 2025
IPL: ఈసారైనా వీరికి టైటిల్ దక్కేనా?

ఐపీఎల్లో కొన్ని జట్లు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయాయి. వాటిలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, RCB, LSG ఉన్నాయి. ఈ సారైనా తమ ఫేవరెట్ జట్లు కప్పు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఐపీఎల్ 18వ సీజన్ నేటి నుంచి మే 25 వరకు కొనసాగనుంది. 64 రోజులపాటు 74 మ్యాచులు జరగనున్నాయి. ప్రస్తుతం టైటిల్ కోసం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి.
News March 22, 2025
ALERT: రేపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షం

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడుతుందని APSDMA తెలిపింది. మరోవైపు ఎండ తీవ్రత కూడా కొనసాగుతుందని పేర్కొంది. కూలీలు, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని విజ్ఞప్తి చేసింది. అలాగే ఇవాళ అత్యధికంగా కర్నూలు జిల్లా ఆస్పరి, సత్యసాయి జిల్లా తొగరకుంటలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది.