News March 6, 2025
అధికారంలోకి వచ్చేది వైసీపీనే: గోరంట్ల మాధవ్

AP: కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పక్కకు పెట్టి వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం పైనే దృష్టి పెట్టిందని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులకు భయపడేదిలేదని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News November 14, 2025
‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ రివ్యూ

పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు బిడ్డను కనే ప్రయత్నంలో ఎదురైన ఆరోగ్య సమస్యను ఎలా అధిగమించాడన్నదే ఈ చిత్ర కథ. బోల్డ్ పాయింట్‌ను డైరెక్టర్ సంజీవ్ వల్గారిటీ లేకుండా ఫ్యామిలీతో చూసేలా తీశారు. విక్రాంత్, చాందినీ చౌదరి పాత్రలు, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్ కామెడీ ప్లస్. కొన్ని సాగదీత సన్నివేశాలు, రొటీన్ అనిపించే కథ, అక్కడక్కడా ఎమోషన్స్ తేలిపోవడం మూవీకి మైనస్ అయ్యాయి.
రేటింగ్: 2.5/5
News November 14, 2025
ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు వచ్చినా..!

ప్రతిపక్ష ఆర్జేడీని మరోసారి పరాజయం వెంటాడింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినా అదే స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. 143 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ 22.84 శాతం ఓట్లు సాధించింది. ఇవి బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే 1.86 శాతం, జేడీయూ కంటే 3.97 శాతం ఎక్కువ. ప్రస్తుతం 26 సీట్లలోనే ఆర్జేడీ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఎన్డీయే 204 స్థానాల్లో లీడ్‌లో ఉంది.
News November 14, 2025
IPL: కోల్‌కతా బౌలింగ్ కోచ్‌గా సౌథీ

న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీని తమ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు KKR ప్రకటించింది. ఈ ఏడాది మొదట్లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సౌథీ.. 2021-2023 మధ్య ఐపీఎల్లో KKR తరఫున ఆడారు. ఇటీవలే షారుక్ ఖాన్ ఫ్రాంచైజీ అభిషేక్ నాయర్‌ను హెడ్ కోచ్‌గా, షేన్ వాట్సన్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది.


