News March 6, 2025

అధికారంలోకి వచ్చేది వైసీపీనే: గోరంట్ల మాధవ్

image

AP: కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పక్కకు పెట్టి వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం పైనే దృష్టి పెట్టిందని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులకు భయపడేదిలేదని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News March 26, 2025

బాత్రూమ్‌లో ఎంతసేపు ఉంటున్నారు?

image

కొందరు అరగంట సేపైనా బాత్రూమ్‌లోనే ఉండిపోతూ కాలక్షేపం చేస్తుంటారు. టాయిలెట్ కమోడ్‌పై కూర్చొని రీల్స్ చూస్తుంటారు. ఇలా ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడంతో పాయువు దగ్గర కండరాలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మలబద్ధకం, ఇన్ఫెక్షన్లు రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. టాయిలెట్‌లో ఎక్కువ సేపు ఫోన్ చూడటంతో మెడ, వెన్ను నొప్పి, తిమ్మిర్లు వస్తాయి. అందుకే వెళ్లిన పనిని త్వరగా కానిచ్చి బయటపడాలంటున్నారు.

News March 26, 2025

కరిగిపోతున్న మంచు.. పెను ప్రమాదంలో చైనా?

image

చైనా మంచినీటి వనరులైన హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. 1960 నుంచి సుమారు 7వేలకు పైగా(సుమారు 26శాతం) మంచుదిబ్బలు మాయమైపోయాయని అంచనా. దీంతో తాగునీటి విషయంలో పెను సమస్యలు తప్పవని చైనా పర్యావరణవేత్తలు ఆందోళనగా ఉన్నారు. టిబెట్, షింజియాంగ్ ప్రావిన్సుల్లో అత్యధికంగా హిమానీనదాలున్నాయి. వాటిని కాపాడేందుకు చైనా పలు మార్గాల్ని అన్వేషిస్తున్నా ఫలితం దక్కడం లేదు.

News March 26, 2025

కోహ్లీ గొప్ప రోల్ మోడల్: నవజ్యోత్

image

విరాట్ కోహ్లీ ఒక ఇన్‌స్టిట్యూషన్ లాంటివారని, ఆయన పేరు కొన్ని తరాలు నిలిచి ఉంటుందని మాజీ క్రికెటర్ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కొనియాడారు. ‘స్టార్ స్పోర్ట్స్’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనొక గొప్ప రోల్ మోడల్ అని, వీధుల్లోని పిల్లలు అతనిలా ఉండాలని కోరుకుంటారని పేర్కొన్నారు. యువతపై అతని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. తన చరిష్మాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

error: Content is protected !!