News March 7, 2025
పాకిస్థాన్‌కు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్?

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి అమెరికాకు వచ్చేవారిని అడ్డుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిపై ట్రావెల్ బ్యాన్ అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కాగా 2016లోనూ ట్రంప్ కొన్ని ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. 2020లో ట్రంప్ నిర్ణయాన్ని అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేశారు. ఆయా దేశాలకు చెందినవారికి USలోకి ప్రవేశం కల్పించారు.
Similar News
News March 9, 2025
గ్రూప్-1 ఫలితాలు.. UPDATE

రేపు గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనున్న సంగతి తెలిసిందే. ముందుగా మార్కులను ప్రకటించనుండగా తర్వాత రీకౌంటింగ్ కోసం అభ్యంతరాలు స్వీకరించనుంది. అనంతరం మెరిట్ మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తితో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయనుంది. మొత్తం 563 పోస్టులకు గాను 21,093 మంది మెయిన్స్ పరీక్ష రాశారు.
News March 9, 2025
ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు రూ.11 వేల కోట్లు

TG: రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.11 వేల కోట్లను మంజూరు చేసింది. వీటి నిర్మాణ బాధ్యతలను విద్యాశాఖ అనుబంధ సంస్థ టీజీఈడబ్ల్యూఐడీసీకి అప్పగించింది. రాష్ట్రంలో 55 నియోజకవర్గాల్లో ఒక్కో క్యాంపస్ చొప్పున రూ.200 కోట్లతో నిర్మించనున్నారు. ముందుగా కొడంగల్, మధిర, హుజుర్ నగర్‌లో నిర్మాణాలకు టెండర్లు పిలవనున్నారు.
News March 9, 2025
త్వరలోనే జీఎస్టీ రేట్లు మరింత తగ్గింపు: నిర్మలా సీతారామన్

త్వరలోనే జీఎస్టీ రేట్లను మరింతగా తగ్గిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ అవసరాలకు తగ్గట్లుగా సవరణలు ఉండేలా చూస్తున్నామని తెలిపారు. దీంతో పాటు ట్యాక్స్ స్లాబ్‌లను రేషనలైజ్ చేస్తామన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ధరలు పెరగలేదని పేర్కొన్నారు. పన్ను చెల్లించేవారికి ఉపశమనం కలిగించడమే తమ లక్ష్యమన్నారు. స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకులకు కారణాలను కచ్చితంగా చెప్పలేమన్నారు.