News March 7, 2025

GET READY: నేడు ఉదయం 11 గంటలకు..

image

ఈ నెల 22 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండగా ఇప్పటికే క్రికెట్ ఫీవర్ మొదలైంది. హైదరాబాద్‌లో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల కానున్నాయి. రెండు టికెట్లు కొంటే ఒక జెర్సీని ఉచితంగా ఇస్తామని SRH ప్రకటించింది. 23న రాజస్థాన్, 27న లక్నోతో ఆరెంజ్ ఆర్మీ మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News March 9, 2025

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

image

AP: ఎమ్మెల్యే కోటా MLC అభ్యర్థుల పేర్లను టీడీపీ ఖరారు చేసింది. కావలి గ్రీష్మ (ఎస్సీ-మాల), బీద రవిచంద్ర (యాదవ), బీటీ నాయుడు (బోయ)కు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించింది. 5 స్థానాలకు గాను ఇప్పటికే ఒకటి జనసేనకు ఇవ్వగా, మరొకటి బీజేపీకి కేటాయించనుంది. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కూతురే కావలి గ్రీష్మ. ఆశావహులు చాలా మందే ఉన్నా ఊహించని నేతలకు టికెట్లు దక్కాయి.

News March 9, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. ప్రైజ్ మనీ ఎంతంటే?

image

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య CT ఫైనల్ జరుగుతోంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ గెలిచిన టీంకు 2.24 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ అందనుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 1.12 మిలియన్ డాలర్లు లభిస్తాయి. టోర్నీలో పాల్గొన్నందుకు IND, NZ సహా అన్ని టీంలు $125,000, గ్రూప్ స్టేజ్‌లో గెలిచిన టీంలు 34,000 డాలర్లు అందుకుంటాయి. 5, 6 స్థానాల్లో నిలిచిన జట్లకు $350,000, 7,8 స్థానాల్లో నిలిచిన జట్లకు $140,000 లభిస్తాయి.

News March 9, 2025

విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్

image

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను ప్రకటించింది. ఒక మహిళ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ అభ్యర్థికి అవకాశం కల్పించింది. నాలుగు స్థానాల్లో ఒకటి సీపీఐకి ఇచ్చిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!