News March 7, 2025
పేర్ని నాని, విక్రాంత్‌రెడ్డికి ముందస్తు బెయిల్

AP: మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. రేషన్ బియ్యం కేసులో A6గా ఉన్న ఆయనకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఇప్పటికే నాని భార్యకు కూడా బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే కాకినాడ పోర్టు వాటాల బదలాయింపు వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డికి కూడా న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
Similar News
News March 9, 2025
రైలులో ప్రసవించిన మహిళ

ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓమహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రైలులో ప్రయాణిస్తున్న మహిళకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికుల సహాయంతో డెలివరీ చేశారు. అనంతరం మథుర స్టేషన్లో తల్లి బిడ్డలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ Xలో పోస్ట్ చేసింది.
News March 9, 2025
వరుస ఓవర్లలో గిల్, కోహ్లీ ఔట్

భారత జట్టుకు షాక్ తగిలింది. వరుస ఓవర్లలో గిల్, విరాట్ ఔటయ్యారు. ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు గిల్ వెనుదిరగగా, బ్రేస్ వెల్ చక్కటి బంతితో కోహ్లీని ఎల్బీగా పెవిలియన్‌కు పంపారు. దీంతో 19 ఓవర్ల వరకు మ్యాచ్‌పై భారత్ ఆధిపత్యం చెలాయించగా, రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ పోటీలోకి వచ్చింది. 21 ఓవర్లకు భారత్ స్కోర్ 113/2.
News March 9, 2025
కొత్త అల్లుడు.. గాడిదపై ఊరేగాల్సిందే!

హోలీ సందర్భంగా MHలోని ఓ గ్రామం 86 ఏళ్లుగా ఓ వింత ఆచారాన్ని కొనసాగిస్తోంది. బీడ్ జిల్లా విడా గ్రామంలో హోలీ రోజు కొత్త అల్లుడిని గాడిదపై ఊరేగిస్తారు. సమీప ప్రాంతాల ప్రజలు భారీగా అక్కడికి వచ్చి కొత్త అల్లుడికి బహుమతులు ఇస్తారు. పూర్వం ఆ ఊరి పెద్ద దేశ్‌ముఖ్ ఆనందరావు అల్లుడు హోలీ ఆడటానికి ఒప్పుకోడు. దాంతో అతనికి నచ్చజెప్పి గాడిదపై ఊరేగించి హోలీ నిర్వహించారని, అప్పట్నుంచి ఆ వేడుక ఇక్కడ కొనసాగుతోంది.