News March 8, 2025

18 లేదా 19న తెలంగాణ బడ్జెట్?

image

TG: ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.. అనంతరం ఈ నెల 18 లేదా 19న బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్, శాఖల వారీ పద్దులపై చర్చ అనంతరం 27న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది.

Similar News

News March 7, 2026

తెలంగాణ సినీ అవార్డులు.. ఉత్తమ నటులు వీరే

image

☞ ఉత్తమ నటుడు- నాగ చైతన్య (తండేల్)
☞ ఉత్తమ నటి- రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
☞ ఉత్తమ సహాయ నటి: భూమిక
☞ ఉత్తమ దర్శకుడు: సాయిలు (రాజు వెడ్స్ రాబాయి)
>>>—జ్యూరీ స్పెషల్ అవార్డులు—<<< ☞ ఉత్తమ హీరో : రోషన్ (ఛాంపియన్) ☞ ఉత్తమ నటుడు : చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి) ☞ ఉత్తమ నటి: అనంతిక (8 వసంతాలు)

News March 7, 2026

చిరంజీవికి తెలంగాణ గద్దర్ అవార్డు-2025

image

☞ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు- చిరంజీవి
☞ పైడి జయరాజ్ అవార్డు- కమల్‌హాసన్
☞ సినారె అవార్డు- సుద్దాల అశోక్ తేజ
☞ అక్కినేని నాగేశ్వరరావు అవార్డు-జయసుధ
☞ నాగిరెడ్డి చక్రపాణి అవార్డు-అశ్వనీదత్
☞ రఘుపతి వెంకయ్య అవార్డు-రమేశ్ ప్రసాద్
☞ కాంతారావు అవార్డు- ఆర్.నారాయణమూర్తి
☞ బీఎన్ రెడ్డి అవార్డ్- సింగీతం శ్రీనివాస్

News March 7, 2026

ఇవాళ భారీగా లొంగిపోనున్న మావోలు.. గణపతి ఉంటారా?

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎదుట ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం నిర్వహించే ప్రెస్‌మీట్‌లో 124 మంది ఆయుధాలతో సహా సరెండర్ కానున్నారు. కేంద్ర బలగాలు, పోలీసులు ఎప్పటి నుంచో వెతుకుతున్న మావో టాప్ కమాండర్ గణపతి వీరిలో ఉంటారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. ఇటీవల సరెండర్ అయిన దేవ్‌జీ సహా కీలక నేతల గన్‌మెన్లు, అనుచరులు లొంగిపోనున్నారు.