News March 8, 2025
18 లేదా 19న తెలంగాణ బడ్జెట్?

TG: ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.. అనంతరం ఈ నెల 18 లేదా 19న బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్, శాఖల వారీ పద్దులపై చర్చ అనంతరం 27న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది.
Similar News
News March 24, 2025
నేను సభకు రావొద్దని రాసివ్వండి: జగదీశ్ రెడ్డి

TG: ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సస్పెండ్ అయిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ అసెంబ్లీకి వెళ్లగా సభలోకి రావొద్దని చీఫ్ మార్షల్ సూచించారు. దీంతో స్పీకర్ ఇచ్చిన బులెటిన్ చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను సభకు రావొద్దని రాతపూర్వకంగా రాసివ్వాలన్నారు. లేకపోతే అక్కడే కూర్చొని నిరసన తెలుపుతానని చెప్పారు. మరోవైపు BRS ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి వచ్చారు. రుణమాఫీ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు.
News March 24, 2025
వైజాగ్-సికింద్రాబాద్ ట్రైన్ అలర్ట్

TG: వైజాగ్ నుంచి సికింద్రాబాద్ మీదుగా వెళ్లే నాలుగు రైళ్లను చర్లపల్లి టెర్మినల్ మీదుగా మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లోక్మాన్య తిలక్ , సంబల్ పూర్ సూపర్ ఫాస్ట్, విశాఖ-నాందేడ్, విశాఖ-సాయినగర్ వీక్లీ ఎక్స్‌ప్రైస్‌ల రూటు మార్చనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 22నుంచి ఈ మార్పులు చేపట్టనున్నారు. దారి మళ్లించడంతో అదనపు ప్రయాణం తమకు భారమవుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 24, 2025
అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం

TG: అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులైన ఎమ్మెల్యే వివేక్, బాల్క సుమన్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వీరిద్దరూ దాదాపు 10 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కాసేపటికి వీరి వద్దకు కేటీఆర్ వచ్చి వివేక్‌తో కాసేపు మాట్లాడారు. వీరిని ఓ ఎమ్మెల్యే ఫొటో తీస్తుండగా కేటీఆర్ వారించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ నియోజకవర్గాలతో పాటు ఢిల్లీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.