News March 8, 2025

ఇందిరమ్మ ఇళ్లపై BIG UPDATE

image

TG: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుభవార్త అందించారు. మరో వారంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పారు. అర్హులైన వారిని ఎంపిక చేసి, పనులు మొదలు పెడతామన్నారు. జాబితాలో పేర్లు రాని వారికి ఆందోళన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఒక నిరంతర ప్రక్రియ అని, మరో విడతలో లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేస్తామని వెల్లడించారు.

Similar News

News January 26, 2026

ఇలా చేస్తే.. జాతరలో తప్పిపోరు!

image

మేడారం మహా జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇంతటి భారీ జనసమూహంలో పిల్లలు, వృద్ధులు తప్పిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే ముందస్తు జాగ్రత్తగా వారి చేతిపై లేదా జేబులో ఫోన్ నంబర్, ఊరి పేరు రాసి ఉంచాలి. స్నానాలు చేసినా చెరిగిపోవద్దంటే జాతరకు వెళ్లే ముందురోజే కోన్ (గోరింటాకు)తో రాయండి. పోలీసుల QR రిస్ట్ బ్యాండ్లతో పాటు ఈ చిన్న చిట్కా మీ ఆత్మీయులను క్షేమంగా ఉంచుతుంది. SHARE IT

News January 26, 2026

ICMRలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(<>ICMR<<>>) 5 స్పెషలిస్ట్ గ్రేడ్ 3(మెడిసిన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. MBBS, PG డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PwBD, మహిళలు, EWSలకు ఫీజు లేదు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.icmr.gov.in

News January 26, 2026

వేరుశనగకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం

image

తెలుగు రాష్ట్రాల్లో వేరుశనగ రికార్డు స్థాయి ధర పలుకుతోంది. TGలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో ఆదివారం వేరుశనగకు రూ.12,009 రికార్డు స్థాయి ధర లభించింది. వనపర్తిలో క్వింటాకు రూ.12,002.. అచ్చంపేటలో క్వింటాకు రూ.11,877 ధర లభించింది. వేరుశనగకు ప్రస్తుతం క్వింటాకు రూ.6 వేలు- రూ.10వేలకు పైగా ధర పలుకుతోంది. తమ పంటకు పెరుగుతున్న డిమాండ్ చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.