News March 8, 2025
ఇందిరమ్మ ఇళ్లపై BIG UPDATE

TG: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుభవార్త అందించారు. మరో వారంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పారు. అర్హులైన వారిని ఎంపిక చేసి, పనులు మొదలు పెడతామన్నారు. జాబితాలో పేర్లు రాని వారికి ఆందోళన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఒక నిరంతర ప్రక్రియ అని, మరో విడతలో లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేస్తామని వెల్లడించారు.
Similar News
News March 19, 2025
సునీత రెండుసార్లు స్పేస్ వాక్ చేశారు: నాసా

అంతరిక్షం నుంచి వచ్చిన నలుగురు వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని నాసా వెల్లడించింది. అన్ డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లు జరిగాయని తెలిపింది. స్పేస్ ఎక్స్, నాసా సమష్టి కృషితో వారిని భూమిపైకి తీసుకొచ్చామని పేర్కొంది. ఈ యాత్రను విజయవంతం చేయడంలో స్పేస్ ఎక్స్ కీలకపాత్ర పోషించిందని ప్రశంసించింది. ఈ యాత్రలో సునీత రెండుసార్లు స్పేస్ వాక్ చేశారని వివరించింది.
News March 19, 2025
ఉపాధి కూలీలకు రూ.400 వేతనం ఇవ్వండి: సోనియా

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు రోజువారీ కనీస వేతనాన్ని రూ.400 ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి 150 పనిదినాలు కల్పించాలన్నారు. పార్లమెంటులో జీరో అవర్‌లో ఆమె మాట్లాడారు. 2005లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దీనిని నిర్వీర్యం చేయాలని చూడటం ఆందోళనకరమని చెప్పారు.
News March 19, 2025
హృతిక్ విషయంలో ఫీలయ్యే వాడిని: రాకేశ్ రోషన్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ బాల్యం గురించి ఆయన తండ్రి రాకేశ్ రోషన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హృతిక్‌కు చిన్నప్పుడు నత్తి ఉండేదని దీంతో ఏ విషయం చెప్పాలన్నా సందేహించేవాడని అన్నారు. ఆ విషయంలో హృతిక్‌ను చూసి ఫీలయ్యే వాడినని రాకేశ్ రోషన్ తెలిపారు. అయితే నత్తిని అధిగమించేందుకు రోజూ ఉదయం గంట పాటు వివిధ భాషల పత్రికలు గట్టిగా చదివేవాడని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.