News March 8, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

వరుసగా రెండు రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.500 పెరిగి రూ.80,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 పెరగడంతో రూ.87,710లకు చేరింది. అటు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి ధర రూ.1,08,100 వద్ద కొనసాగుతోంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.
Similar News
News November 15, 2025
PGIMERలో 13 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

చండీగఢ్‌లోని<
News November 15, 2025
IPL: మ్యాక్సీని వదిలేసిన పంజాబ్!

ఆస్ట్రేలియా స్టార్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకోకుండా పంజాబ్ కింగ్స్ విడిచిపెట్టింది. ఆయనతో పాటు ఆరోన్ హార్డీ, కుల్‌దీప్ సేన్, విష్ణు వినోద్‌ను కూడా విడుదల చేసింది. IPLలో విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన మ్యాక్సీ గత కొన్ని సీజన్లుగా తేలిపోతున్నారు. ఈ ఏడాది టోర్నీలో 7 మ్యాచులాడి కేవలం 47 పరుగులే చేశారు. దీంతో మ్యాక్సీని భారంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 15, 2025
ప్రెగ్నెన్సీకి సిద్ధంగా ఉన్నారా?

ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పటి నుంచే చాలా విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గర్భం దాల్చడానికి ముందు మహిళలు తమ శరీరం అందుకు సహకరించేలా చూసుకోవాలి. ఎముకలు, కండరాల పటిష్టత, శరీరంలోని రక్తం పరిమాణం, శారీరక, మానసికబలంపై దృష్టి పెట్టాలి. వ్యాయామం, పోషకాహారం తప్పనిసరి. థైరాయిడ్, విటమిన్ D3, విటమిన్ B12, బ్లడ్ షుగర్ టెస్టులు కూడా చేయించుకోవాలి.


