News March 8, 2025

మహిళలు ఒక మర్డర్ చేసేందుకు ఇమ్యూనిటీ కల్పించండి: NCP SP

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు NCP SP మహిళా విభాగం చేసిన విజ్ఞప్తి చర్చనీయాంశంగా మారింది. ఒక హత్య చేసినా మహిళలకు శిక్ష పడకుండా రక్షణ కల్పించాలని ఆ శాఖ ప్రెసిడెంట్ రోహిణి ఖడ్సే కోరారు. ‘స్త్రీలందరి తరఫున మేం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒక మర్డర్ చేసేందుకు మాకు ఇమ్యూనిటీ కల్పించండి. అణచివేత వైఖరి, రేపిస్టు మైండ్‌సెట్, చైతన్యం లేని శాంతిభద్రతల పరిస్థితిని స్త్రీలు చంపాలని భావిస్తున్నారు’ అని లేఖ రాశారు.

Similar News

News April 2, 2026

రాముడి లుక్‌కు ఫిదా.. VFXపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు!

image

నితేశ్ తివారీ ‘రామాయణ’ <<19543549>>టీజర్‌పై<<>> SMలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. ‘ఆదిపురుష్’ కంటే బెటర్ అని కొందరు.. అంతా ఏఐ వీడియోలా ఉందంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో VFX క్వాలిటీ, గ్రాఫిక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

News April 2, 2026

ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్ భేటీ

image

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం నేపథ్యంలో ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. PMను మంగళగిరి శాలువాతో సత్కరించి, ధన్యవాదాలు తెలిపారు. లోకేశ్‌కు కూడా మోదీ కంగ్రాట్స్ చెప్పారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను లోకేశ్ కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.

News April 2, 2026

30రోజుల్లో 10 T20లు.. టీమ్ఇండియాకు బిజీ షెడ్యూల్

image

IPL తర్వాత టీమ్ఇండియా టీ20ల షెడ్యూల్ బిజీబిజీగా ఉంది. జూన్ 26 నుంచి జులై 26వ తేదీ మధ్య నెల రోజుల వ్యవధిలో ఏకంగా 10 టీ20 మ్యాచులు ఆడనుంది. జూన్ 26, 28వ తేదీల్లో ఐర్లాండ్‌తో 2 టీ20ల్లో బరిలోకి దిగనుంది. ఆ తర్వాత జులై 1, 4, 7, 9, 11వ తేదీల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. మళ్లీ జులై 23, 25, 26వ తేదీల్లో జింబాబ్వేతో ఆడనుంది. ఇక IPLలో రాణించే యువ క్రికెటర్లు ఈ సిరీసులకు సెలెక్ట్ అయ్యే అవకాశముంది.