News March 8, 2025
మహిళలు ఒక మర్డర్ చేసేందుకు ఇమ్యూనిటీ కల్పించండి: NCP SP

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు NCP SP మహిళా విభాగం చేసిన విజ్ఞప్తి చర్చనీయాంశంగా మారింది. ఒక హత్య చేసినా మహిళలకు శిక్ష పడకుండా రక్షణ కల్పించాలని ఆ శాఖ ప్రెసిడెంట్ రోహిణి ఖడ్సే కోరారు. ‘స్త్రీలందరి తరఫున మేం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒక మర్డర్ చేసేందుకు మాకు ఇమ్యూనిటీ కల్పించండి. అణచివేత వైఖరి, రేపిస్టు మైండ్‌సెట్, చైతన్యం లేని శాంతిభద్రతల పరిస్థితిని స్త్రీలు చంపాలని భావిస్తున్నారు’ అని లేఖ రాశారు.
Similar News
News January 19, 2026
VJA -HYD రూట్‌లో ట్రాఫిక్ క్లియర్

సంక్రాంతి సెలవులు ముగించుకుని విజయవాడ నుంచి హైదరాబాద్‌కి ఇవాళ ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తిరుగు ప్రయాణం అయ్యారు. ట్రాఫిక్ పోలీసుల ముందస్తు చర్యల్లో భాగంగా భారీ వాహనాలను దారి మళ్లించడంతో మధ్యాహ్నం మూడు గంటలకే ట్రాఫిక్ క్లియర్ అయింది. ప్రస్తుతం విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం జంక్షన్ వరకు ఎక్కడా వాహనాల రద్దీ లేదు. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు డ్రోన్లతో వాహనాలను ట్రాకింగ్ చేస్తున్నారు.
News January 19, 2026
ఎన్నికల నగారా.. ఫిబ్రవరి 14న పోలింగ్?

TG: మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 21న షెడ్యూల్, ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అటు అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. మరి ‘ప్రేమికుల రోజు’ ఓటర్లు ఎవరిపై ప్రేమ కురిపిస్తారో చూడాలి.
News January 19, 2026
FEB 9న AP మెడికల్ కౌన్సిల్ ఎన్నిక

AP మెడికల్ కౌన్సిల్ ఎన్నిక FEB 9న జరగనుంది. ఈనెల 27వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ‘మండలిలో సభ్యత్వం కలిగిన 55,504 మంది వైద్యుల్లో రాష్ట్రంలో ఐదేళ్లకు పైబడి ఉంటున్న వారు పోటీకి అర్హులు. సభ్యులు ఎక్కడ్నుంచైనా ఆన్‌లైన్, మొబైల్ ద్వారా ఓటు వేయొచ్చు. దీనికోసం APMC ఆన్‌లైన్ ఎలక్షన్ పోర్టల్‌లో లాగిన్ కావాలి’ అని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు వెల్లడించారు. కాగా APMCకి 13 మందిని ఎన్నుకుంటారు.


