News March 8, 2025
‘బిగ్ బెన్’ టవర్‌పై వ్యక్తి హల్చల్

లండన్‌లోని ప్రఖ్యాత ‘బిగ్ బెన్’ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. పాలస్తీనా జెండా చేతపట్టుకున్న అతడు ‘పాలస్తీనాకు విముక్తి కల్పించండి’ అని నినాదాలు చేశాడు. అప్రమత్తమైన అధికారులు అతడిని సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. కాగా హమాస్‌తో యుద్ధం నాటి నుంచి పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది.
Similar News
News January 20, 2026
నన్ను అడగడం కాదు.. నేనే వాళ్లను ప్రశ్నలడిగా: హరీశ్ రావు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తనను ప్రశ్నలడగడం కాదని, తానే వాళ్లను చాలా ప్రశ్నలు అడిగానని మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్‌చాట్‌లో అన్నారు. ‘ఫోన్ ట్యాపింగ్‌తో నాకేంటి సంబంధం. నేను హోంమంత్రిగా చేయలేదు కదా. అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను అడగండి. సిట్టు, లట్టు, పొట్టుకు మేం భయపడం. నాకు సిట్ నోటీసు ఇవ్వడం కాదు. సీఎం రేవంత్‌కు ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి’ అని వ్యాఖ్యానించారు.
News January 20, 2026
ముగిసిన టెట్ ఎగ్జామ్స్.. ఈ నెల 30న ‘కీ’

TG: రాష్ట్రంలో ఈ నెల 3న ప్రారంభమైన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షలు నేటితో ముగిశాయి. పేపర్-1,2కు మొత్తం 2.38 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 82.09 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రస్తుతం టీచర్లుగా కొనసాగుతున్నవారు టెట్ రాయాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పుతో ఈసారి 71,670 మంది ఇన్ సర్వీస్ టీచర్లు అప్లై చేశారు. ఈ నెల 30న ‘కీ’, ఫిబ్రవరి 10-16 మధ్య ఫలితాలు వెలువడనున్నాయి.
News January 20, 2026
తినేటప్పుడు మాట్లాడుతున్నారా? ఈ విషయాలు తెలుసా!

ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడితే డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి ద్వారా అధికంగా గాలి పొట్టలోకి చేరి తేన్పులు, గ్యాస్ సమస్యలు రావొచ్చు. ఒక్కోసారి అన్నవాహికలోకి కాకుండా గాలి వెళ్లే గొట్టంలోకి ఆహారం వెళ్లి గొంతునొప్పి, తీవ్రమైన దగ్గు వస్తుంది. ఎక్కువగా తినడంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది. సరిగ్గా నమలకపోవడంతో జీర్ణరసాలు ఆహారంలో కలవక అసిడిటీ సమస్యలు తలెత్తుతాయి.


