News March 8, 2025
‘బిగ్ బెన్’ టవర్‌పై వ్యక్తి హల్‌చల్

లండన్‌లోని ప్రఖ్యాత ‘బిగ్ బెన్’ టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. పాలస్తీనా జెండా చేతపట్టుకున్న అతడు ‘పాలస్తీనాకు విముక్తి కల్పించండి’ అని నినాదాలు చేశాడు. అప్రమత్తమైన అధికారులు అతడిని సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. కాగా హమాస్‌తో యుద్ధం నాటి నుంచి పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది.
Similar News
News March 22, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గి సామాన్యుడికి కాస్త ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.82,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.89,780కు చేరింది. అటు వెండి ధర ఏకంగా రూ.2000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,10,000గా ఉంది. కాగా, రెండు రోజుల్లోనే వెండీ ధర ఏకంగా రూ.4100 తగ్గడం విశేషం.
News March 22, 2025
సైబర్ నేరగాళ్లకూ టార్గెట్.. ఛేదించకపోతే నరకమే!

ఉద్యోగాల కోసం ఏజెంట్ ద్వారా మయన్మార్, థాయ్‌లాండ్‌కు వెళ్లి సైబర్ ముఠా వలలో చిక్కుకున్న 589 మంది భారతీయులను కేంద్రం రక్షించింది. సైబర్ క్రైమ్స్ చేయడమే ఆ ఉద్యోగమని తెలియక అక్కడికి వెళ్లి నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘వీసా లాక్కుంటారు. టార్గెట్స్ చేరుకోకపోతే ఎండలో 4కి.మీలు పరిగెత్తిస్తారు. పుష్‌అప్స్ చేయిస్తారు. పాడైపోయిన బాతు గుడ్లు తినిపిస్తారు’ అని తెలంగాణకు చెందిన ఓ బాధితుడు BBCతో చెప్పారు.
News March 22, 2025
రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు రాయలసీమలో, కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరోవైపు నిన్న రాష్ట్రంలో ఎండలు మండిపోయాయి. నంద్యాల జిల్లా చాగలమర్రిలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కర్నూలు జిల్లా కోసిగిలో 40.6 డిగ్రీలు నమోదయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 మండలాల్లో వడగాలులు వీచాయి.