News March 8, 2025
VIRAL: ఐస్‌క్రీమ్‌లో పాము

అసలే ఎండాకాలం కావడంతో ఉపశమనం కోసం ఐస్‌క్రీమ్ తిందామనుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఎదురైంది. థాయ్‌లాండ్‌లో ఆ వ్యక్తి చాకోబార్ ఐస్‌క్రీమ్ తీసుకొని కవర్ తీయగానే అందులో గడ్డకట్టుకుపోయిన పాము కనిపించింది. ఆ చాకోబార్‌లో పూర్తిగా ఒక చిన్న పాము శరీరం ఉండిపోయింది. దీనిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది. దీనిపై అక్కడి అధికారులు విచారణ చేపట్టారు.
Similar News
News April 15, 2026
‘AMARAVATHI’ కాదు ‘AMARAVATI’

AP: రాజధాని అమరావతి పేరును ఆంగ్లంలో తప్పుడు స్పెల్లింగ్ వినియోగించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎలా వాడాలో సూచిస్తూ CS సర్క్యులర్ జారీచేశారు. 2015లో ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా ‘AMARAVATI’ని ప్రకటించిందని పేర్కొన్నారు. అయితే కలెక్టర్లు, ఇతర అధికారులు నివేదికల్లో అమరావతిని ఇంగ్లిష్‌లో ‘AMARAVATHI’ అని రాస్తున్నారని పేర్కొంది. ఇకపై ‘AMARAVATI’ అని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.
News April 15, 2026
అమ్మాయిలకు మీసాలు.. కారణమిదే

కొంతమంది అమ్మాయిలకు అబ్బాయిల్లా మీసాలు, గడ్డాలు రావడంతో పాటు ముఖంపై ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయి. ఈ సమస్యను హిర్సుటిజం(Hirsutism) అంటారు. ఈ సమస్య PCOD, థైరాయిడ్ ఉన్నవారిలో కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో చాలా తక్కువ మోతాదులో ఉండే మేల్ హార్మోన్స్ పెరగడం, కొన్నిరకాల మందులు వాడటం వల్ల కూడా ముఖంపై వెంట్రుకలు వస్తాయి. సమస్యను గుర్తించగానే వైద్యులను సంప్రదించడం మంచిది.