News March 8, 2025

VIRAL: ఐస్‌క్రీమ్‌లో పాము

image

అసలే ఎండాకాలం కావడంతో ఉపశమనం కోసం ఐస్‌క్రీమ్ తిందామనుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఎదురైంది. థాయ్‌లాండ్‌లో ఆ వ్యక్తి చాకోబార్ ఐస్‌క్రీమ్ తీసుకొని కవర్ తీయగానే అందులో గడ్డకట్టుకుపోయిన పాము కనిపించింది. ఆ చాకోబార్‌లో పూర్తిగా ఒక చిన్న పాము శరీరం ఉండిపోయింది. దీనిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది. దీనిపై అక్కడి అధికారులు విచారణ చేపట్టారు.

Similar News

News March 15, 2026

ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు

image

AP: రాష్ట్రంలో రానున్న 3రోజులు ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో భిన్న వాతావరణం ఉంటుందని APSDMA అంచనా వేసింది. ద్రోణి, నైరుతి నుంచి వీచే గాలులతో రేపు SKLM, VZM, మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ELR, కృష్ణా, NTR, GNT, KNL, NDYL, ATP, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసేందుకు ఆస్కారం ఉందని చెప్పింది.

News March 15, 2026

అకౌంట్లలోకి రూ.6,000.. మొదట వీరికే!

image

TG: అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ఈ నెల 22న ‘రైతుభరోసా’ నిధులు <<19391741>>విడుదల<<>> చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా ఎకరం వరకు ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.6,000 చొప్పున జమ చేయనుంది. ఇందుకోసం సర్కార్ రూ.3,590 కోట్లు వెచ్చించనుంది. ఇక 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత డబ్బులు రిలీజ్ చేయనుంది. కాగా రైతుభరోసా ద్వారా ఏడాదికి రూ.12వేలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.

News March 15, 2026

తమిళనాడు ఎన్నికలు.. ఫ్రంట్ రన్నర్‌గా DMK?

image

<<19389988>>TN ఎన్నికల్లో<<>> AIADMK నేతృత్వంలోని NDA, DMK, TVK పార్టీల మధ్య పోరు నెలకొంది. 234 స్థానాల్లో 2021లో 159సీట్లతో అధికారంలోకి వచ్చిన DMKకు వెల్ఫేర్ స్కీమ్‌లు, ద్రవిడియన్ మోడల్ గవర్నెన్స్‌ బలం. ఇక పళనిస్వామి AIADMKను నడిపిస్తున్నా జయలలిత లేని లోటును పూడ్చుకునే పనిలోనే ఉన్నట్లు విశ్లేషకుల మాట. అటు TVK యూత్, మైనార్టీ ఓట్లను చీల్చే ఛాన్స్ ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా DMKకు కలిసొస్తుందని అంటున్నారు.