News March 8, 2025
ట్రంప్ గోల్ఫ్ రిసార్ట్‌పై పాలస్తీనా మద్దతుదారుల దాడి

బ్రిటన్‌లో పాలస్తీనా మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. స్కాట్లాండ్‌లోని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్ఫ్ రిసార్ట్‌పై దాడి చేశారు. అక్కడి భవనంపై గ్రాఫిటీ పెయింట్ పూశారు. గ్రౌండ్‌లో ‘గాజా ఈజ్ నాట్ ఫర్ సేల్’ అని రాశారు. అంతకుముందు పాలస్తీనా మద్దతుదారుడు లండన్‌లోని ‘బిగ్ బెన్’ టవర్ ఎక్కి <<15693466>>హల్‌చల్<<>> చేశాడు.
Similar News
News January 13, 2026
మాటేస్తున్న మాంజా.. ఇలా చేయండి!

సంక్రాంతి సందర్భంగా చైనా మాంజా వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న HYD మీర్‌పేట్‌లో ఓ వృద్ధురాలి(85) కాలిని, విధులకు వెళ్తున్న ఏఎస్సై నాగరాజు మెడను మాంజా కోసేసింది. దీంతో వాహనాలపై వెళ్లేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. శరీరమంతా కవర్ అయ్యేలా దుస్తులు ధరించాలి. మెడకు కర్చిఫ్ కట్టుకోవాలి. కాళ్లకు సాక్సులు, షూ, చేతులకు గ్లౌవ్స్ వేసుకోవడం వల్ల మాంజాల నుంచి రక్షణ పొందవచ్చు.
News January 13, 2026
రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వరి ధాన్యం కొనుగోలు

TG: వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్రం రికార్డును సాధించింది. ఈ ఏడాది 70.82 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. దీంతో రాష్ట్ర చరిత్రలో 2020-2021లో సాధించిన 70.2లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును అధిగమించింది. వరి ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు కనీస మద్దతు ధర కింద రూ.16,606కోట్లు చెల్లించింది. సన్నరకం వరి ధాన్యానికి బోనస్‌గా రూ.1,425 కోట్లు సైతం చెల్లించినట్లు ప్రభుత్వం చెబుతోంది.
News January 13, 2026
భోగి పర్వదినాన గోదా రంగనాథ కళ్యాణం

భోగి పర్వదినాన ఆండాళ్ అమ్మవారు-శ్రీ రంగనాథ స్వామి దివ్య కళ్యాణం నిర్వహించడం అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది. ఈ కళ్యాణం ద్వారా వివాహ అడ్డంకులు తొలగి, దాంపత్య అన్యోన్యత పెరిగి, కుటుంబంలో శాంతి, శుభమంగళాలు స్థిరపడతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ అరుదైన పుణ్యావకాశాన్ని సద్వినియోగం చేసుకుని వేదమందిర్‌లోనే గోదా రంగనాథుల అనుగ్రహాన్ని పొందండి. ఇవాళే మీ పేరు, గోత్రంతో సంకల్పం <


