News March 8, 2025

ట్రంప్ గోల్ఫ్ రిసార్ట్‌పై పాలస్తీనా మద్దతుదారుల దాడి

image

బ్రిటన్‌లో పాలస్తీనా మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. స్కాట్లాండ్‌లోని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్ఫ్ రిసార్ట్‌పై దాడి చేశారు. అక్కడి భవనంపై గ్రాఫిటీ పెయింట్ పూశారు. గ్రౌండ్‌లో ‘గాజా ఈజ్ నాట్ ఫర్ సేల్’ అని రాశారు. అంతకుముందు పాలస్తీనా మద్దతుదారుడు లండన్‌లోని ‘బిగ్ బెన్’ టవర్ ఎక్కి <<15693466>>హల్‌చల్<<>> చేశాడు.

Similar News

News March 18, 2025

ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో AP టాప్: ADR

image

దేశవ్యాప్తంగా 4,092 మంది MLAలలో 1,861 మంది(45%)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ADR నివేదిక వెల్లడించింది. వారిలో 1,205 మందిపై తీవ్రమైన కేసులు(మర్డర్, హత్యాయత్నం, కిడ్నాపింగ్, మహిళలపై నేరాలు) ఉన్నట్లు తెలిపింది. ‘79% మంది(138/174) MLAలపై కేసులతో AP టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత కేరళ, TG(69%), బిహార్(66%), మహారాష్ట్ర(65%), TN(59%) ఉన్నాయి. తీవ్రమైన కేసుల్లోనూ AP అగ్రస్థానంలో ఉంది’ అని పేర్కొంది.

News March 18, 2025

SHOCKING.. మోమోస్ తయారీ కేంద్రంలో కుక్క మాంసం!

image

పంజాబ్‌లో మటౌర్‌లోని ఓ ఫ్యాక్టరీలో కుక్క మాంసం కలకలం రేపింది. మోమోస్, స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో అధికారులు తనిఖీలు చేయగా ఫ్రిడ్జిలో కుక్క తల కనిపించింది. దీంతో పాటు కొంత మాంసాన్ని గుర్తించారు. ఆ తలను టెస్టుల కోసం పంపించారు. కాగా ఈ ఫ్యాక్టరీ నుంచి చాలా చోట్లకు మోమోస్, స్ప్రింగ్ రోల్స్ పంపిస్తారని సమాచారం. మోమోస్ తయారీలో కుక్క మాంసాన్ని ఉపయోగించారా? అనేది తెలియాల్సి ఉంది.

News March 18, 2025

జపాన్‌లో ‘దేవర’ స్పెషల్ షోకు అనూహ్య స్పందన

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా జపాన్ ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఈనెల 28న జపాన్‌లో ‘దేవర’ రిలీజ్ కానుండగా మేకర్స్ స్పెషల్ షోను ఏర్పాటు చేశారు. దీనికి భారీగా ప్రేక్షకులు తరలివచ్చారు. మూవీ అద్భుతంగా ఉందంటూ వారు SMలో పోస్టులు పెడుతున్నారు. కాగా, ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్, మేకర్స్ ఈనెల 22న జపాన్‌కు వెళ్లనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.

error: Content is protected !!