News March 9, 2025
GOOD NEWS.. చేనేత కార్మికులకు రుణమాఫీ

TG: చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.33 కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు ఇచ్చింది. ఒక్కో కార్మికుడికి రూ.లక్ష వరకు రుణమాఫీ కానుంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్న లోన్లకు ఇది వర్తించనుంది.
Similar News
News March 10, 2025
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మణిపుర్, వక్ఫ్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ చర్చ జరిగే అవకాశముంది. మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం లోక్‌సభ ఆమోదం కోరే అవకాశముంది. మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగిన సంగతి తెలిసిందే. రెండో విడత ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.
News March 10, 2025
ప్రాజెక్టుల్లో పడిపోతున్న నీటి నిల్వలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఖాళీ అవుతున్నాయి. కృష్ణా బేసిన్‌లోని నాగార్జున సాగర్, శ్రీశైలంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఇరు ప్రాజెక్టుల్లో ఇంకా 45 టీఎంసీలే మిగిలి ఉన్నాయి. బోర్డు ఆదేశాలను లెక్కచేయకుండా ఏపీ జలదోపిడీ చేస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఇక గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌లో 29.27 టీఎంసీలు, నిజాంసాగర్‌లో 8.35 టీఎంసీలు, సింగూరు ప్రాజెక్టులో 22.34 టీఎంసీలే ఉన్నాయి.
News March 10, 2025
ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

TG: బీఎడ్‌లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఎల్లుండి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా మే 24వరకు లేట్ ఫీజుతో స్వీకరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550, మిగతావారు రూ.750 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
వెబ్‌సైట్: https://edcet.tgche.ac.in