News March 10, 2025
ప్రాజెక్టుల్లో పడిపోతున్న నీటి నిల్వలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఖాళీ అవుతున్నాయి. కృష్ణా బేసిన్‌లోని నాగార్జున సాగర్, శ్రీశైలంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఇరు ప్రాజెక్టుల్లో ఇంకా 45 టీఎంసీలే మిగిలి ఉన్నాయి. బోర్డు ఆదేశాలను లెక్కచేయకుండా ఏపీ జలదోపిడీ చేస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఇక గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌లో 29.27 టీఎంసీలు, నిజాంసాగర్‌లో 8.35 టీఎంసీలు, సింగూరు ప్రాజెక్టులో 22.34 టీఎంసీలే ఉన్నాయి.
Similar News
News March 22, 2025
హైదరాబాద్‌లో భారీ వర్షం

TG: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, హైదర్ నగర్, నిజాంపేట్ తో పాటు నగరంలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులతో భారీగా గాలులు వీయడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ వర్షం పడిన సంగతి తెలిసిందే.
News March 22, 2025
మార్చి22: చరిత్రలో ఈరోజు

*1739: ఇరాన్ పాలకుడు నాదిర్ షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనం అపహరించాడు
*2000: భారత కృత్తిమ ఉపగ్రహం ఇన్‌శాట్-3బి ప్రయోగం విజయవంతం
*2005: తమిళ నటుడు జెమినీ గణేశన్ మరణం
*2007: తత్వవేత్త ఉప్పులూరి గోపాలకృష్ణ మరణం
*2009: తెలుగు సినీ నటుడు టి.ఎల్.కాంతారావు మరణం
ప్రపంచ జల దినోత్సవం
News March 22, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 22, శుక్రవారం ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.19 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు ఇష: రాత్రి 7.40 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.