News March 10, 2025
శుభ ముహూర్తం (10-03-2025)

☛ తిథి: శుక్ల ఏకాదశి, ఉ.9.52 వరకు
☛ నక్షత్రం: పుష్యమి రా.2.21 వరకు
☛ శుభ సమయం: ఉ.6.04-6.40 వరకు
☛ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు
☛ యమగండం: ఉ.10.30-12.00 వరకు
☛ దుర్ముహూర్తం: 1.మ.12.24-1.12 వరకు
2.మ.2.46-3.34 వరకు
☛ వర్జ్యం: ఉ.10.16-11.52 వరకు
☛ అమృత ఘడియలు: రా.11.58-1.34 వరకు
Similar News
News March 10, 2025
జియో కొత్త ప్లాన్.. రూ.100తో..

ఓటీటీ వ్యూయర్ల కోసం రిలయన్స్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.100తో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 5GB డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 90 రోజులు ఉంటుంది. హాట్‌స్టార్ ఫోన్ లేదా టీవీ ఏదైనా ఒకదానిలో ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్లో ఎలాంటి వాయిస్ కాలింగ్ ఉండదు.
News March 10, 2025
ఆ రైతులకూ రూ.20వేలు: మంత్రి అచ్చెన్న

AP: అర్హులైన ప్రతి రైతుకు ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేలు ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి బ్యాంకుల్లో జమ చేస్తామని వెల్లడించారు. కౌలు రైతులు, వెబ్ ల్యాండ్‌లో నమోదైన వారికీ పథకం వర్తిస్తుందన్నారు. మరో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. రూ.30 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తెచ్చామన్నారు. 16 రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని వివరించారు.
News March 10, 2025
ట్రంప్ టారిఫ్స్‌తో భారత్‌కు మేలు: RBI మాజీ డిప్యూటీ గవర్నర్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ పెంపుతో భారత్‌కు మేలు జరగొచ్చని RBI మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య అన్నారు. కంపెనీల మధ్య ఇది పోటీతత్వం పెంచుతుందని అంచనా వేశారు. ఫలితంగా తయారీ, ఉత్పత్తిలో నాణ్యత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మానవ వనరుల నైపుణ్యంపై కంపెనీలు పెట్టుబడులు పెడతాయని పేర్కొన్నారు. ఆరంభంలో మార్జిన్లు తగ్గినా చివరికి మంచే జరుగుతుందని వెల్లడించారు.