News March 10, 2025
జియో కొత్త ప్లాన్.. రూ.100తో..

ఓటీటీ వ్యూయర్ల కోసం రిలయన్స్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.100తో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 5GB డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 90 రోజులు ఉంటుంది. హాట్‌స్టార్ ఫోన్ లేదా టీవీ ఏదైనా ఒకదానిలో ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్లో ఎలాంటి వాయిస్ కాలింగ్ ఉండదు.
Similar News
News April 18, 2026
వరంగల్: NMC చేసిన మార్పుల వల్లే పరీక్ష వాయిదా!

MBBS పరీక్షల సిలబస్‌లో NMC నియమ నిబంధనల ప్రకారం (పాత నిబంధనలు) పేపర్-Iలోని జనరల్ సర్జరీ కింద చేర్చిన కొన్ని అధ్యాయాలు ఇప్పుడు కొత్త నిబంధనల్లో జనరల్ సర్జరీ పేపర్-IIలో చేర్చడం వల్లే ఈ నెల 15న జరిగిన <<19670707>>MBBS జనరల్ సర్జరీ పేపర్-1 (రెగ్యులర్) పరీక్ష రద్దు చేసి<<>>, ఈ నెల 27కు వాయిదా వేసినట్లు KNRUHS ప్రకటించింది. విద్యార్థుల నుంచి ఎక్కువ సంఖ్యలో విజ్ఞప్తులు రావడంతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.
News April 18, 2026
సర్వీస్ ఇనామ్ భూములకు విముక్తి

AP: గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్ భూములు కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ భూములకు నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించింది. రాష్ట్రంలో 1,36,024 ఎకరాలను ఫ్రీ హోల్డ్ పరిధిలోకి తీసుకొస్తున్నామని, నిషేధ జాబితా 22(A) నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్చింది. దీంతో వీటి క్రయ, విక్రయాలకు, రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించనుంది. అవి పట్టా భూములుగా రికార్డుల్లో ఉంటాయి.
News April 18, 2026
భూములిచ్చే రైతులకు ఎకరాకు ₹40 వేల కౌలు: CBN

AP: రాజధాని రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చే రైతులకు ఎకరానికి ₹40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని CM చంద్రబాబు తెలిపారు. ఏడాదికి ₹3 వేల చొప్పున కౌలు పెంచుతామని హామీ ఇచ్చారు. కుటుంబానికి ₹1.50 లక్షల మేర వ్యవసాయ రుణమాఫీ చేస్తామని వివరించారు. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన 10 గ్రామాల రైతులతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.


