News March 10, 2025

మోడల్ స్కూల్స్ ప్రవేశాలు.. 20 వరకు అవకాశం

image

సిద్దిపేట జిల్లాలోని మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించారు. 6 నుంచి10వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని గజ్వేల్ మండలం ముత్రాజ్పల్లి మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ డా. జె.వన్నెస్స తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 10, 2025

ITBP స్పోర్ట్స్ కోటాలో 133 ఉద్యోగాలు

image

ITBP స్పోర్ట్స్ కోటాలో 133 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, షూటింగ్, బాక్సింగ్, కబడ్డీ, తదితర క్రీడా విభాగాల్లో 3/4/2023 నుంచి 2/4/2025 వరకు నోటిఫికేషన్‌లోని పేరా (4)Dలో పేర్కొన్న క్రీడల్లో మెడల్స్ సాధించి ఉండాలి. ఈ నెల 4న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 4 వరకు అందుబాటులో ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News March 10, 2025

బాపట్ల పీజీఆర్‌ఎస్‌కు 89 అర్జీలు

image

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో 89 అర్జీలు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.

News March 10, 2025

జగిత్యాల ప్రజావాణిలో 50 ఫిర్యాదులు

image

జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 50 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్. లత, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

error: Content is protected !!