News March 10, 2025
పూరీ డైరెక్షన్‌లో నాగార్జున సినిమా?

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో అక్కినేని నాగార్జున ఓ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూరీ చెప్పిన స్టోరీ నాగ్‌కు నచ్చిందని, చర్చలు కొనసాగుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో శివమణి (2003), సూపర్ (2005) తెరకెక్కాయి. విక్టరీ వెంకటేశ్, అక్కినేని అఖిల్‌తోనూ పూరీ జగన్నాథ్ సినిమాలు చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News April 2, 2026
నేడు రాజ్యసభకు అమరావతి బిల్లు

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు నిన్న లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం లాంఛనమే కానుంది. అనంతరం బిల్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు వెళ్తుంది. ఆమె ఆమోదముద్ర వేయగానే చట్ట రూపం దాలుస్తుంది. దీంతో ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి నిలిచిపోనుంది.
News April 2, 2026
ఆర్టెమిస్-2: చంద్రుడి కక్ష్యలోకి స్మార్ట్‌ఫోన్లు..

NASA చేపట్టిన ఆర్టెమిస్-2 <<19542665>>యాత్ర<<>> రికార్డులు సృష్టిస్తోంది. ఇది అపోలో-13 కంటే 3,345 మైళ్లు ఎక్కువ దూరం ప్రయాణించనుంది. అలాగే చంద్రుడి కక్ష్యలోకి వెళ్తున్న తొలి మహిళగా క్రిస్టినా కోచ్ చరిత్రకెక్కనున్నారు. రెండు మినీ వ్యాన్ల పరిమాణంలో ఉండే ఓరియన్ నౌకలో నలుగురు వ్యోమగాములు తమ వెంట స్మార్ట్‌ఫోన్‌లు తీసుకెళ్తుండటం విశేషం. 10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో వీరు నింగి నుంచి సూర్య గ్రహణాన్ని వీక్షించనున్నారు.
News April 2, 2026
ట్రంప్ ప్రకటన.. భారీగా పెరిగిన క్రూడాయిల్ ధర

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ <<19543167>>ప్రకటన<<>> నేపథ్యంలో క్రూడాయిల్ ధర భగ్గుమంది. బ్రెంట్ క్రూడ్ ధర 4 శాతం పెరిగి 105 డాలర్లకు చేరింది. అలాగే WTI బ్యారెల్ చమురు రేట్ 3 శాతం ఎగసి 103 డాలర్లుగా ఉంది. ఇక ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. ఈ ప్రభావంతో భారత మార్కెట్లు కూడా నష్టపోయే ఛాన్స్ ఉంది. అటు బంగారం, వెండి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.


