News March 10, 2025
పూరీ డైరెక్షన్‌లో నాగార్జున సినిమా?

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో అక్కినేని నాగార్జున ఓ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూరీ చెప్పిన స్టోరీ నాగ్‌కు నచ్చిందని, చర్చలు కొనసాగుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో శివమణి (2003), సూపర్ (2005) తెరకెక్కాయి. విక్టరీ వెంకటేశ్, అక్కినేని అఖిల్‌తోనూ పూరీ జగన్నాథ్ సినిమాలు చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News March 27, 2025
కరుణ్ నాయర్‌కు BCCI నుంచి పిలుపు?

విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు BCCI ఆయనను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అంతకు ముందు ఇండియా-A జట్టులో ఆయనకు చోటు కల్పిస్తారని వార్తలు వస్తున్నాయి. కరుణ్ కొద్దిరోజులుగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో 5, SMATలో 3 సెంచరీలు బాదారు. దీంతో ఆయనను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగాయి.
News March 27, 2025
కొడాలి నానికి ఆపరేషన్

AP: YCP నేత కొడాలి నానికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు HYDలోని AIG డాక్టర్లు నిర్ధారించారు. ఆయన గుండెలో 3 వాల్వ్స్ బ్లాక్ అయినట్లు గుర్తించి సర్జరీ చేయాలని నిర్ణయించారు. మరికొన్ని వైద్య పరీక్షల అనంతరం ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొడాలి ఆరోగ్యంపై మాజీ CM జగన్ డాక్టర్లతో మాట్లాడారు. మరోవైపు నాని అనారోగ్యం విషయం తెలిసి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News March 27, 2025
DANGER: అధికంగా సౌండ్స్ వింటున్నారా?

చుట్టూ ఉన్న ముప్పును మనం గుర్తించలేకపోతున్నాం. సౌండ్ పొల్యూషన్ ఎంతో ప్రమాదకరం. ఏళ్లుగా అధిక సౌండ్స్ వింటున్నట్లైతే అనారోగ్యపడినట్లే. ఇలాంటి వారికి గుండెపోటు, హైబీపీ, స్ట్రోక్, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూరప్‌లో శబ్ద కాలుష్యం కారణంగా ఏటా 12000 మంది చనిపోతుండగా లక్షల మందికి నిద్రలేమి సమస్యలొస్తున్నాయి. 55-60 డెసిబెల్స్ దాటిందంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది.