News March 10, 2025
భారత సంతతి విద్యార్థిని మిస్సింగ్

అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్ టూర్‌కు వెళ్లి ప్యూంటా కానా బీచ్ వద్ద అదృశ్యమయ్యారు. దీంతో ఆమె కోసం పోలీసులు హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో తీవ్రంగా గాలిస్తున్నారు. వర్జీనియాలో ఉంటున్న సుదీక్ష పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో చదువుతోందని ఆమె తండ్రి సుబ్బరాయుడు తెలిపారు.
Similar News
News March 10, 2025
తెలంగాణ భక్తులకు నిరాశ

తిరుమలలో తెలంగాణ భక్తులకు మళ్లీ నిరాశే ఎదురైంది. మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్దామనుకున్న వారి లేఖలను టీటీడీ స్వీకరించడం లేదు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఇలా చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. కేవలం తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల లేఖలే తీసుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై టీటీడీ ఇంకా స్పందించలేదు.
News March 10, 2025
‘మండే’పోయిన Stock Markets

స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 74115 (-217), నిఫ్టీ 22460 (-92) వద్ద ముగిశాయి. అనిశ్చితి, ట్రంప్ టారిఫ్స్, US షట్‌డౌన్ అంశాలు సూచీలను పడేశాయి. FMCG షేర్లు ఎగిశాయి. రియాల్టి, PSUబ్యాంకు, O&G, వినియోగం, ఎనర్జీ, ఆటో, తయారీ, మెటల్, హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంకు షేర్లు ఎరుపెక్కాయి. పవర్‌గ్రిడ్, HUL, ఇన్ఫీ, SBI లైఫ్, నెస్లే, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్. ONGC, ట్రెంట్ టాప్ లూజర్స్.
News March 10, 2025
BIG BREAKING: నిలిచిపోయిన X సేవలు

ప్రపంచ వ్యాప్తంగా X(ట్విటర్) సేవలు నిలిచిపోయాయి. సైట్ ఓపెన్ కాకపోవడంతో యూజర్లంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకౌంట్‌లోకి లాగిన్ కాలేక, లాగిన్ అయినా యాక్సిస్ చేయలేక అసౌకర్యానికి లోనవుతున్నారు. దాదాపు అరగంట నుంచి ట్విటర్ పనిచేయడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మీకూ సేవలు నిలిచిపోయాయా? కామెంట్ చేయండి. దీనిపై సదరు సంస్థ ఇంకా స్పందించలేదు.