News March 10, 2025

భారత సంతతి విద్యార్థిని మిస్సింగ్

image

అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్ టూర్‌కు వెళ్లి ప్యూంటా కానా బీచ్ వద్ద అదృశ్యమయ్యారు. దీంతో ఆమె కోసం పోలీసులు హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో తీవ్రంగా గాలిస్తున్నారు. వర్జీనియాలో ఉంటున్న సుదీక్ష పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో చదువుతోందని ఆమె తండ్రి సుబ్బరాయుడు తెలిపారు.

Similar News

News March 19, 2025

ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్ కొత్త రూల్స్

image

ఏప్రిల్ 1 నుంచి TDS(మూలం వద్ద పన్నుకోత) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సీనియర్ సిటిజన్ల FD, RDపై వార్షిక ఆదాయం రూ.లక్ష వరకు ఉంటే TDS వర్తించదు. ప్రస్తుతం రూ.50వేల వరకే ఉంది. అలాగే సాధారణ ప్రజల వడ్డీ ఆదాయం రూ.50వేలు మించకుండా ఉంటే దానిపై బ్యాంకులు TDS కట్ చేయవు. బీమా ఏజెంట్లు, స్టాక్‌ బ్రోకర్లకు వార్షిక కమిషన్‌ ఆదాయం రూ.15,000 మించితే TDS వర్తించేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.20,000కు పెంచారు.

News March 19, 2025

మోహన్‌బాబుకు ‘కన్నప్ప’ టీమ్ విషెస్

image

మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా ‘కన్నప్ప’ టీమ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రంలో మహాదేవ శాస్త్రి పాత్రలో నటిస్తున్న ఆయన ఫొటోను కుమారుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల మూవీ నుంచి విడుదలైన టీజర్‌, పాటకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News March 19, 2025

మరింత బాధ్యతగా పని చేసేలా జనసేన అడుగులు: పవన్

image

AP: పిఠాపురం చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ అధినేత, Dy.CM పవన్ ధన్యవాదాలు తెలిపారు. ‘రానున్న రోజుల్లో ఇంకా బలమైన పార్టీగా జనసేన మారుతుంది. సామాన్యుల గొంతుకగా, రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ఐక్యత లక్ష్యంగా మరింత బాధ్యతగా పని చేసే దిశగా అడుగులు వేయనుంది. పార్టీ బలోపేతం కోసం జనసేన శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి పని చేయాలి’ అని పవన్ ట్వీట్ చేశారు.

error: Content is protected !!