News March 10, 2025
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును బీజేపీ ప్రకటించింది. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోము వీర్రాజు గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ తరఫున గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన నుంచి నాగబాబు పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి.
Similar News
News March 10, 2025
ITBP స్పోర్ట్స్ కోటాలో 133 ఉద్యోగాలు

ITBP స్పోర్ట్స్ కోటాలో 133 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, షూటింగ్, బాక్సింగ్, కబడ్డీ, తదితర క్రీడా విభాగాల్లో 3/4/2023 నుంచి 2/4/2025 వరకు నోటిఫికేషన్‌లోని పేరా (4)Dలో పేర్కొన్న క్రీడల్లో మెడల్స్ సాధించి ఉండాలి. ఈ నెల 4న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 4 వరకు అందుబాటులో ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ <
News March 10, 2025
పాకిస్థాన్‌లో ఆడినా టీమ్ ఇండియానే విజేత అయ్యుండేది: అక్రమ్

అన్ని జట్లూ పాక్‌లో ఆడితే, భారత్ మాత్రం దుబాయ్‌లో ఆడి అన్యాయంగా గెలిచిందంటూ పాక్ అభిమానులు చేస్తున్న ఆరోపణల్ని ఆ దేశ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ కొట్టిపారేశారు. ‘ఈ భారత జట్టు ప్రపంచంలో ఎక్కడ ఆడినా కప్ కచ్చితంగా గెలిచి ఉండేది. వారు పాక్ వచ్చి ఆడినా గెలిచేవారు. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలిచారు. భారత్‌కున్న క్రికెట్ బలానికి అదే నిదర్శనం’ అని కొనియాడారు.
News March 10, 2025
కోర్టులో జడ్జి ముందు ఒక్కసారిగా విలపించిన నటి!

బంగారం స్మగ్లింగ్ చేస్తూ కెంపెగౌడ విమానాశ్రయంలో దొరికిపోయిన నటి రన్యారావు కోర్టులో ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. న్యాయమూర్తి ముందు కన్నీరు పెట్టుకున్నారు. కస్టడీలో అధికారులు తనను మానసికంగా హింసించారని, దుర్భాషలాడారని ఆరోపించారు. మరోవైపు విచారణకు రన్య సహకరించడం లేదని కోర్టుకు DRI వెల్లడించింది. హింసించారన్న ఆమె ఆరోపణ అవాస్తవమని పేర్కొంది.