News March 10, 2025
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును బీజేపీ ప్రకటించింది. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోము వీర్రాజు గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ తరఫున గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన నుంచి నాగబాబు పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి.
Similar News
News March 22, 2025
ఆ రైతులకు పరిహారం చెల్లించాలి: బండి

TG: గత పదేళ్లలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనూ ఆదుకున్న దాఖలాలు లేవని దుయ్యబట్టారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే సర్వే చేసి వారం రోజుల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. మరోవైపు ప్రజల దృష్టి మరల్చేందుకు డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారని ఫైరయ్యారు.
News March 22, 2025
ఫోన్ చూస్తూ తింటున్నారా.. జాగ్రత్త!

చాలామందికి తినే సమయంలోనూ ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. ప్లేటులో ఏముందో కూడా పట్టించుకోకుండా తినేవారు ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘తినే ప్రతి ముద్దను ఆస్వాదిస్తే అరుగుదల మెరుగ్గా ఉంటుంది. దృష్టి ఫోన్‌పై ఉంటే ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో కూడా మనకు తెలీదు. దీని వల్ల పోషకాహార లోపమో లేక ఊబకాయం రావడమో జరుగుతుంది. రెండూ ప్రమాదమే’ అని వివరిస్తున్నారు.
News March 22, 2025
అంతరిక్ష కేంద్రం భూమిపై కూలుతుందా?

ఎన్నో అంతరిక్ష ప్రయోగాలకు వేదికైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) భూమి నుంచి 415 కి.మీల ఎత్తులో ఉంది. 2031లో ఈ ISS మిషన్ పూర్తవనుంది. దీంతో 109 మీటర్ల పొడవున్న ISS తన కక్ష్య నుంచి పూర్తిగా వైదొలిగి భూమి దిశగా రానుంది. ఈక్రమంలో అట్మాస్పిరిక్ డ్రాగ్ ప్రభావంతో ISS తనంతట తాను ధ్వంసం అయ్యేలా NASA చేయనుంది. మిగిలిన భాగాలు పసిఫిక్ సముద్రంలోని ‘పాయింట్ నెమో’ (అంతరిక్ష వ్యర్థాల వాటిక)లో పడేలా చేస్తారు.