News March 10, 2025
ప్రణయ్ హత్య కేసు: ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు

TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు శిక్ష విధించింది. ఏ2గా ఉన్న సుభాష్‌కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీ రావు 2020లో ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో మిర్యాలగూడలో అమృతతో కలిసి వెళ్తోన్న ప్రణయ్‌ను సుభాష్ శర్మ కత్తితో నరికి చంపాడు.
Similar News
News March 10, 2025
ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాలు రాష్ట్ర అప్పులు కావు: కేంద్రం

అమరావతి కోసం తీసుకున్న రుణాలు AP అప్పుల పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో YCP MP అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ‘ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ.6,700 కోట్ల చొప్పున రుణం వచ్చేలా సహాయం చేశాం. ఇవి రాష్ట్ర అప్పులు కావు. రాజధానిలో మౌలిక వసతుల కోసం రూ.2,500 కోట్లు సమకూర్చాం. కౌంటర్ పార్ట్ ఫండింగ్ ద్వారా గరిష్ఠంగా రూ.1500 కోట్లు సమకూర్చాలని నిర్ణయించాం’ అని పేర్కొంది.
News March 10, 2025
ప్రధాని మోదీని కలిసిన ఈటల

TG: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఈటల మనవడిని ముద్దు చేసిన మోదీ చాక్లెట్లు అందించారు. కుటుంబ సమేతంగా మోదీతో గడిపిన క్షణాలకు సంబంధించిన ఫొటోలను Xలో ఈటల పంచుకున్నారు. ప్రధానితో చాలా విలువైన సమయం గడిపానని, తన జీవితంలో ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోనని రాసుకొచ్చారు.
News March 10, 2025
కేంద్రమంత్రి నాలిక అదుపులో పెట్టుకోవాలి: సీఎం స్టాలిన్

కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘ధర్మేంద్ర తనను తాను రాజు అనుకుంటున్నారు. ఆయన నాలిక అదుపులో పెట్టుకోవాలి. ‘పీఎం శ్రీ’ పథకాన్ని మేమెప్పుడూ ఒప్పుకోలేదు. కానీ మేం ఒప్పుకుని మాట మార్చామంటూ ఆయన అవాస్తవాలు చెబుతున్నారు. మీరు తమిళనాడు విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధుల్ని ఇస్తారా లేదా ముందు అది చెప్పండి’ అని ప్రశ్నించారు.