News March 10, 2025

కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు: KTR

image

TG: ఈనెల 12 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకు BRS అధినేత KCR హాజరవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ పాల్గొంటారు. ఆయన వచ్చి కాంగ్రెస్ నేతల అబద్ధాలు, దూషణలు పడాలా? ఇలాంటి నేతలున్న సభకు ఆయన రావాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. వీరి స్థాయికి మేం చాలు. ఆయన అవసరం లేదు’ అని తెలిపారు. ఈనెల 16 తర్వాత ఫార్ములా ఈ-రేసు కేసులో తనను మళ్లీ విచారణకు పిలుస్తారని పేర్కొన్నారు.

Similar News

News March 10, 2025

విశాఖలో ‘హయగ్రీవ’ భూములు వెనక్కి

image

AP: విశాఖలో హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్స్‌కు ఇచ్చిన 12.41 ఎకరాల భూ కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతూ సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది. అటు అమరావతిలోనూ 13 సంస్థల భూ కేటాయింపులను రద్దు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ <<15713685>>నిర్ణయించిన<<>> విషయం తెలిసిందే.

News March 10, 2025

మరో అమ్మాయితో చాహల్.. ధనశ్రీ సంచలన పోస్ట్

image

టీమ్ ఇండియా క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మహిళను బ్లేమ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. దీంతో SMలో తనపై వచ్చిన కామెంట్స్‌పై ధనశ్రీ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. అటు నిన్న CT ఫైనల్ మ్యాచ్‌కు <<15704215>>చాహల్<<>> మరో అమ్మాయితో కలిసి వెళ్లిన వీడియోలు వైరల్ అయ్యాయి.

News March 10, 2025

ALERT.. నోటిఫికేషన్ విడుదల

image

AP: ECET-2025 నోటిఫికేషన్‌ను JNTU అనంతపురం విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 7వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా డిప్లొమా చదువుతున్న వారు ఇంజినీరింగ్, ఫార్మసీ సెకండియర్ సహా మరికొన్ని కోర్సుల్లో చేరవచ్చు. మే 6వ తేదీన ఉ.9-12 వరకు, మ.2-5 వరకు పరీక్ష జరుగుతుంది.

error: Content is protected !!