News March 10, 2025

పాకిస్థాన్‌లో ఆడినా టీమ్ ఇండియానే విజేత అయ్యుండేది: అక్రమ్

image

అన్ని జట్లూ పాక్‌లో ఆడితే, భారత్ మాత్రం దుబాయ్‌లో ఆడి అన్యాయంగా గెలిచిందంటూ పాక్ అభిమానులు చేస్తున్న ఆరోపణల్ని ఆ దేశ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ కొట్టిపారేశారు. ‘ఈ భారత జట్టు ప్రపంచంలో ఎక్కడ ఆడినా కప్ కచ్చితంగా గెలిచి ఉండేది. వారు పాక్ వచ్చి ఆడినా గెలిచేవారు. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలిచారు. భారత్‌కున్న క్రికెట్ బలానికి అదే నిదర్శనం’ అని కొనియాడారు.

Similar News

News March 10, 2025

రేపు ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటన

image

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న క్రమంలో ఆ గ్రామ ప్రజలతో ఆయన భేటీ కానున్నారు. గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు కావాలి? ఇంకా ఏం చేయాలి? అభివృద్ధి సహా ఇతర సదుపాయాలపై వారితో చర్చిస్తారు. అనంతరం మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్నారు.

News March 10, 2025

రేపు ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

image

AP: రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి(D) కూనవరం, వరరామచంద్రపురం, వేలేర్పాడు, మన్యం(D) పాలకొండ, సీతంపేట, లక్ష్మీనర్సుపేట, బూర్జ, హీరా మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 62 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇక్కడ <>క్లిక్ <<>>చేసి ఈ జాబితాలో మీ ఊరు ఉందేమో చూసుకోండి.

News March 10, 2025

ప్రభాస్-ప్రశాంత్ సినిమా టైటిల్ ఇదేనా?

image

రెబల్ స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. దానిపై ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. మూవీ స్టోరీ మహాభారతంలోని బకాసురుడి గురించి ఉంటుందని టాక్. ఆ పేరు మీదే ‘బకా’ అనే టైటిల్‌ను పెట్టాలని ప్రశాంత్ భావిస్తున్నారని సమాచారం. బకాసురుడిని భీముడు చంపాడు. మరి ప్రభాస్ భీముడి పాత్రను పోషిస్తారా లేక ఇది వేరే ఏదైనా కథనా అన్నది ఆసక్తికరంగా మారింది.

error: Content is protected !!