News March 10, 2025
రేపు ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటన

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న క్రమంలో ఆ గ్రామ ప్రజలతో ఆయన భేటీ కానున్నారు. గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు కావాలి? ఇంకా ఏం చేయాలి? అభివృద్ధి సహా ఇతర సదుపాయాలపై వారితో చర్చిస్తారు. అనంతరం మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్నారు.
Similar News
News March 15, 2025
ఆయుర్దాయం పెరగాలంటే ఇలా చేయండి!

ఫ్యామిలీతో కలిసి ఎక్కువకాలం బతకాలని అందరూ కోరుకుంటారు. ఇది సాధ్యం కావాలంటే కొన్ని పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. కడుపులో 80 శాతం నిండినంత వరకే తినాలి. టీవీ, ఫోన్ చూడకుండా నెమ్మదిగా కింద కూర్చునే తినాలి. హెర్బల్ టీ తాగాలి. రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి. సమీపంలోని ప్రదేశాలకు నడక ద్వారానే వెళ్లాలి. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకుని వ్యాధులను గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
News March 15, 2025
వాళ్లే జనసేన MLAలు: అంబటి రాంబాబు

AP: తన సిద్ధాంతం ఏంటో తెలియని స్థితిలో Dy.CM పవన్ ఉన్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ‘పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్‌రేట్ అని మాట్లాడుతున్నారు. గెలిచిన వారిలో అసలైన జనసేన నేతలు ఎంతమంది? YCP టికెట్ రాని, చంద్రబాబు మనుషులే జనసేన MLAలు. 2 పార్టీలు వాపును చూసి బలం అనుకుంటున్నాయి. జనసేన MLAలు దోపిడీ చేస్తుంటే పవన్ చుక్కలు లెక్కబెడుతున్నారు’ అని విమర్శించారు.
News March 15, 2025
రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

TG: గోషామహల్ BJP MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో BJP అధికారంలోకి వస్తే MIM పార్టీ అధినేత అసుదుద్దీన్ ఒవైసీ దేశాన్ని వదిలిపోయేలా చేస్తానని హెచ్చరించారు. ‘లేదంటే BJPలో చేరతానని మా నేతల కాళ్లు పట్టుకునేలా చేస్తాను. హోలీ జరగనివ్వకూడదని, నగరంలో హింస సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ ఆయనకు మెంటల్ హాస్పిటల్లో చికిత్స ఇప్పించాలి’ అని సూచించారు.