News March 23, 2024

‘రివ్యూస్ రాస్తే డబ్బులు’.. ఇలాంటి ప్రకటనలు నమ్మకండి

image

TG: సైబర్ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. రివ్యూస్ రాసే పార్ట్‌‌టైమ్ జాబ్ అంటూ హైదరాబాద్‌లో ఓ వ్యక్తిని నిలువునా ముంచేశారు. ఆన్‌లైన్‌లో బాధితుడికి పరిచయమైన మోసగాళ్లు.. హోటల్స్‌ను ప్రమోట్ చేయడంలో భాగంగా రివ్యూస్ రాస్తే డబ్బు ఇస్తామన్నారు. తొలుత పనికి తగ్గ డబ్బులు ఇస్తూ వచ్చారు. ఆపై మరింత పెట్టుబడి పెడితే లాభాలొస్తాయని బాధితుడిని నమ్మించి రూ.13,57,288 దోచేశారు.

Similar News

News October 2, 2024

ఫోన్ల ధరలు పెరిగే ఛాన్స్!

image

ప్రపంచవ్యాప్తంగా సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. అమెరికాలోని నార్త్ కరోలినాలో హెలెన్ హరికేన్ కారణంగా క్వార్ట్జ్ ఉత్పత్తి ఆగిపోయింది. బ్రెజిల్, రష్యాల్లో క్వార్ట్జ్ లభించినా.. సెమీకండక్టర్లలో ఉపయోగించే నాణ్యమైన క్వార్ట్జ్ నార్త్ కరోలినాలోనే దొరుకుతుంది. వరదల కారణంగా విద్యుత్ సరఫరా, రవాణా ఆగిపోవడంతో సప్లై చైన్ తెగిపోయింది.

News October 2, 2024

వడ్డీరేట్ల కోతకు టైమొచ్చింది: RBI మాజీ గవర్నర్ రంగరాజన్

image

ఇన్‌ఫ్లేషన్ స్లోడౌన్ అవ్వడంతో వడ్డీరేట్ల కోతకు టైమ్ వచ్చిందని RBI మాజీ గవర్నర్ సీ రంగరాజన్ అన్నారు. రెండు దఫాల్లో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం మంచిదన్నారు. ఒకవేళ రెపోరేట్ తగ్గిస్తే మార్కెట్లను నడిపించడం కాకుండా అనుసరించడం కిందకు వస్తుందన్నారు. ఆగస్టులోనే RBI రెపోరేట్ తగ్గిస్తుందని ఎకానమిస్టులు అంచనా వేశారు. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ నిలకడగా 4% లోపు ఉంటేనే ఆలోచిస్తామని శక్తికాంతదాస్ స్పష్టం చేశారు.

News October 2, 2024

జపాన్‌లో పేలిన అమెరికా బాంబు!

image

జపాన్‌లో మియజాకీ ఎయిర్ పోర్టులో ఉన్న రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు తాజాగా పేలింది. దాన్ని చాలాకాలం క్రితమే రన్ వే అడుగున మట్టిలో పూడ్చిపెట్టారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడెందుకు పేలిందన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు సంభవించిన చోట పెద్ద గొయ్యి ఏర్పడిందని, దగ్గర్లో విమానాలేవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని వివరించారు. ఈ ఘటనతో 80 విమానాల్ని రద్దు చేశారు.