News March 23, 2024
‘రివ్యూస్ రాస్తే డబ్బులు’.. ఇలాంటి ప్రకటనలు నమ్మకండి
TG: సైబర్ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. రివ్యూస్ రాసే పార్ట్‌టైమ్ జాబ్ అంటూ హైదరాబాద్‌లో ఓ వ్యక్తిని నిలువునా ముంచేశారు. ఆన్‌లైన్‌లో బాధితుడికి పరిచయమైన మోసగాళ్లు.. హోటల్స్‌ను ప్రమోట్ చేయడంలో భాగంగా రివ్యూస్ రాస్తే డబ్బు ఇస్తామన్నారు. తొలుత పనికి తగ్గ డబ్బులు ఇస్తూ వచ్చారు. ఆపై మరింత పెట్టుబడి పెడితే లాభాలొస్తాయని బాధితుడిని నమ్మించి రూ.13,57,288 దోచేశారు.
Similar News
News September 14, 2024
మా దేశం సురక్షితమే.. భారతీయులు రండి: ఇరాన్
ఇరాన్‌లో ఉద్రిక్తతల దృష్ట్యా పర్యాటకం బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో తమ దేశానికి రావాలంటూ భారత్‌లో ఇరాన్ రాయబారి ఇరాజ్ ఇలాహీ భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ‘ఇజ్రాయెల్‌కు ఇరాన్‌కు మధ్య ఉద్రిక్తతలు ఎప్పటి నుంచో ఉన్నవే. మా దేశం చాలా సురక్షితం. భారత మిత్రులు వచ్చి పర్యటించండి’ అని కోరారు. ప్రస్తుతం ఇరు దేశాలకు మధ్య 2 విమానాలు మాత్రమే డైరెక్ట్‌గా నడుస్తుండగా, అవి మరింతగా పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
News September 14, 2024
ఫార్మాసిటీ ఉన్నట్టా? లేనట్టా?: BRS
TG: RR జిల్లా యాచారంలో నిర్మించతలపెట్టిన ఫార్మాసిటీ ఉన్నట్టా? లేనట్టా? అని BRS పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘గతంలో ఫార్మాసిటీ రద్దు చేస్తానని చెప్పిన CM రేవంత్ 13వేల ఎకరాలను అమ్మే కుట్రపన్నారు. కోర్టు అక్షింతలు వేయడంతో మాట మార్చి ఫార్మాసిటీ ఉందంటున్నారు. ఫార్మాసిటీ రద్దు చేస్తే ఆ భూములు వెంటనే రైతులకు ఇవ్వాలి. ఫ్యూచర్ సిటీ, AI సిటీ అంటూ CM ఫేక్ ప్రచారం చేస్తున్నారు’ అని BRS దుయ్యబట్టింది.
News September 14, 2024
ప్రేమ పెళ్లి చిచ్చు: ‘చంటి’ సినిమా తరహాలో..
AP: కర్నూలు జిల్లాలో ‘చంటి’ సినిమా తరహా ఘటన జరిగింది. పెద్దకడబూరు మండలం కల్లుకుంటకు చెందిన ఓ దళిత యువకుడు బీసీ యువతిని ప్రేమ వివాహం చేసుకుని కుటుంబంతో సహా గ్రామాన్ని విడిచి వెళ్లాడు. ఇటీవల అబ్బాయి తల్లి ఊళ్లోకి రాగా అమ్మాయి కుటుంబసభ్యులు, బంధువులు కలిసి ఆమెను చెట్టుకు కట్టేశారు. మతిస్థిమితం లేని ఓ వ్యక్తితో పెళ్లి జరిపించేందుకు యత్నించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి ఆ మహిళను విడిపించారు.