News March 10, 2025
రేపు ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటన

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న క్రమంలో ఆ గ్రామ ప్రజలతో ఆయన భేటీ కానున్నారు. గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు కావాలి? ఇంకా ఏం చేయాలి? అభివృద్ధి సహా ఇతర సదుపాయాలపై వారితో చర్చిస్తారు. అనంతరం మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్నారు.
Similar News
News March 11, 2025
హీరోకు గాయం.. మరింత ఆలస్యం కానున్న ‘వార్-2’!

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వార్-2’ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది. ఈ చిత్రంలో స్టార్ హీరోల మధ్య ఓ సాంగ్ ప్లాన్ చేయగా తాజాగా రిహార్సల్స్‌లో హృతిక్ గాయపడినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మేలో ఈ పార్ట్ షూట్ చేస్తారని సమాచారం. దీంతో విడుదలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
News March 11, 2025
2027 నాటికి భారత్‌లో భారీగా ఏఐ నిపుణుల కొరత

వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా ఎదిగేందుకు భారత్ సిద్ధంగా ఉందని బెయిన్ అండ్ కంపెనీ అంచనా వేసింది. అయితే దేశంలో ఏఐ నిపుణుల కొరత పెరుగుతోందని తెలిపింది. 2027 నాటికి 10 లక్షలకు పైగా నిపుణుల కొరత ఉండొచ్చని అభిప్రాయపడింది. మరోవైపు ఉద్యోగ అవకాశాలు 23 లక్షలు దాటొచ్చని పేర్కొంది. ఏఐకి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఈ రంగంలో నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉందని తెలిపింది.
News March 11, 2025
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అవార్డు

TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో శంషాబాద్ విమానాశ్రయం ఈ అవార్డుకు ఎంపికైంది. 2024కు గానూ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15-25 మిలియన్ల ప్రయాణికులకు రాకపోకలు అందించి బెస్ట్ విమానాశ్రయంగా నిలిచింది. విమానాశ్రయ పరిణామం, సిబ్బంది తీరు, పరిశుభ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.