News March 11, 2025
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అవార్డు

TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో శంషాబాద్ విమానాశ్రయం ఈ అవార్డుకు ఎంపికైంది. 2024కు గానూ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15-25 మిలియన్ల ప్రయాణికులకు రాకపోకలు అందించి బెస్ట్ విమానాశ్రయంగా నిలిచింది. విమానాశ్రయ పరిణామం, సిబ్బంది తీరు, పరిశుభ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.
Similar News
News March 11, 2025
భార్యాభర్తల ❤️ బాండింగ్ మరింత పెరగాలంటే..

ప్రేమ జంటలు, కొత్త దంపతులను చూస్తే ముచ్చటేస్తుంది. భాగస్వాముల పట్ల కేరింగ్, ఎమోషన్, ఇంటీమసీ బాగుంటుంది. సంసారంలో పడి, ఆఫీసులో బిజీ అయ్యాక లైఫ్ బోరింగ్, రొటీన్‌గా అనిపిస్తుంది. మళ్లీ హనీమూన్ తరహా శృంగారానుభూతులు పొందాలంటే 2:2:2 రూల్ పాటించాలని చెప్తున్నారు నిపుణులు. 2 వారాలకోసారి డేట్‌నైట్, 2 నెలలకోసారి వీకెండ్ గెట్‌అవే, 2 ఏళ్లకోసారి లాంగ్ వెకేషన్ ప్లాన్‌చేస్తే దాంపత్యం అత్యంత సుఖమయం అంటున్నారు.
News March 11, 2025
150 మంది సైనికుల ఊచకోత!

పాకిస్థాన్‌లో BLA (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) నరమేధం సృష్టించింది. తమ అధీనంలో ఉన్న 450 మందిలో 150 మంది సైనికులను ఊచకోత కోసినట్లు బీఎల్ఏ స్వయంగా ప్రకటించింది. తమపై సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బీఎల్ఏ హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ రైలులో ప్రయాణిస్తున్న వందలాదిమందిని బందీలుగా తీసుకున్నారు.
News March 11, 2025
KCRను కలిసిన దాసోజు శ్రవణ్

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. తనకు MLCగా అవకాశం ఇచ్చినందుకు కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అటు దాసోజుకు కేసీఆర్ అభినందనలు తెలిపారు.