News March 11, 2025
అనకాపల్లి: బాలికపై అత్యాచారం.. 25 ఏళ్ల జైలు శిక్ష

అనకాపల్లికి చెందిన మూడున్నర ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పోక్సో కోర్టు జడ్జి కే.నాగమణి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. అనకాపల్లికి చెందిన ఓ కుటుంబం గతేడాది విజయనగరం జిల్లా కొఠారుబిల్లిలో వివాహానికి హాజరైంది. నిందితుడు వి.రవి ఆ కుటుంబానికి చెందిన బాలికను పక్కకు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Similar News
News March 12, 2025
ఆమె అరెస్ట్ నిర్బంధ పాలనకు పరాకాష్ఠ: KTR

TG: మహిళా జర్నలిస్ట్ రేవతిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి KTR విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఓ రైతు కష్టాల వీడియోను పోస్ట్ చేస్తే అరెస్ట్ చేయడం నిర్బంధ పాలనకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. ప్రజాపాలనలో మీడియాకు స్వేచ్ఛ లేదని, రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా అని ప్రశ్నించారు. రేవతి అరెస్ట్‌ను హరీశ్ రావు కూడా ఖండించారు.
News March 12, 2025
సిరిసిల్ల జిల్లాలోని ఉష్ణోగ్రత వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. వీర్నపల్లి 36.7°c, కోనరావుపేట 36.5°c, సిరిసిల్ల 36.1°c, ఇల్లంతకుంట 36.0°c, ఎల్లారెడ్డిపేట 36.0°c, చందుర్తి 35.4°c, వేములవాడ 35.0°c,రుద్రంగి 34.5°c, ముస్తాబాద్ 34.5°c లుగా ఉష్ణోగ్రత నమోదు అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో 8 మండలాలకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News March 12, 2025
గ్రూప్ 2లో మెరిసిన ఆసిఫాబాద్ ఆణిముత్యం

కౌటాల మండల వాసి సాయిరాం గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 191 ర్యాంకు సాధించారు. కాగా ఇప్పుడు బెజ్జూరు మండలం మొగవెల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, తోటి మిత్రులు అభినందనలు తెలిపారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 4 ఫలితాల్లో కూడా విజయం సాధించినప్పటికీ దానిని వదులుకున్నట్లు సాయిరాం గౌడ్ తెలిపారు.