News March 12, 2025
ఆమె అరెస్ట్ నిర్బంధ పాలనకు పరాకాష్ఠ: KTR

TG: మహిళా జర్నలిస్ట్ రేవతిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి KTR విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఓ రైతు కష్టాల వీడియోను పోస్ట్ చేస్తే అరెస్ట్ చేయడం నిర్బంధ పాలనకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. ప్రజాపాలనలో మీడియాకు స్వేచ్ఛ లేదని, రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా అని ప్రశ్నించారు. రేవతి అరెస్ట్‌ను హరీశ్ రావు కూడా ఖండించారు.
Similar News
News March 19, 2025
ఢిల్లీ వీధుల్లో న్యూజిలాండ్ ప్రధాని గల్లీ క్రికెట్

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఇండియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ వీధుల్లో అక్కడి పిల్లలతో క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపారు. ఆయనతో పాటు కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ కూడా ఉన్నారు. ఇండియా, న్యూజిలాండ్‌ను ఏకం చేయడంలో క్రికెట్‌ను మించినది లేదని క్రిస్టోఫర్ ట్వీట్ చేశారు.
News March 19, 2025
2025-26 బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

TG: 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాసేపట్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు నల్లపోచమ్మ గుడిలో బడ్జెట్ ప్రతులను ఉంచి భట్టి ప్రత్యేక పూజలు చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలి సారి. కాగా బడ్జెట్ రూ.3లక్షల కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా.
News March 19, 2025
రికార్డు దిశగా గోల్డ్ ధరలు!

బంగారం ధరలు పెరుగుతుండటం చూస్తుంటే త్వరలోనే రూ.లక్షకు చేరేలా కనిపిస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.82,900లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరగడంతో రూ.90,440కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.1000 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,14,000గా ఉంది. శుభకార్యాల నేపథ్యంలో బంగారానికి భారీ డిమాండ్ నెలకొంది.